అనంతపురం జెఎన్టీయూ సమీపంలో ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఓ  మార్ట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఉదయం ప్రారంభం కావలసిన మార్ట్ రాత్రికి రాత్రే అగ్ని కీలల్లో చిక్కుకుంది. ఈ ఘటనతో దాదాపుగా నిర్వాహకులకు డెబ్బైలక్షలకుపైగా నష్టం వాటిల్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలపెట్టారు. ఎక్కడా ఎలాంటి క్లూ లేదు. షార్ట్ సర్క్యూట్‌తో తగలబడింది అనుకొన్నారు. కానీ అలాంటి ఆనవాళ్లే లేకపోయేసరికి ఇదో మిస్టరీ కేస్‌లా మారింది పోలీసులకు.


రోజులు గడిచే కొద్ది పోలీసులపై ఒత్తిడి పెరిగింది. దీంతో సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు పోలీసులు. స్థానికంగా ఉన్న అనుమానాలతో విచారణ షురూ చేశారు. సవాల్‌గా తీసుకున్న పోలీసులు..ప్రత్యర్థులు ఎవరనే కోణంలో విచారణ రీస్టార్ట్ చేశారు. అక్కడే పోలీసులకు క్లూ దొరికింది.


 ఆ మార్ట్ అనంతపురంలో 4బ్రాంచ్‌లు ఉన్నాయి. అలాంటి మార్ట్‌కు పెద్ద మార్ట్ నిర్వాహకుల నుంచి పోటీ ఉండదు. ఉన్నా.. మార్ట్ తగలబెట్టేంత నీచపు పనికి దిగజారరు. ఇలాంటి విశ్లేషణలతో ఒక్కొక్క తీగలాగుతూ వచ్చారు. చివరిగా మార్ట్ పరిసరప్రాంతాల్లోని షాపుల నిర్వాహకులపై పోలీసుల కన్నుపడింది. అందర్నీ పిలిచి ప్రశ్నించారు.


పోలీసుల అనుమానం నిజమైంది. ప్రమాదానికి గురైన మార్ట్‌ పక్కనే ఉన్న ఓ చిన్న దుకాణం నిర్వాహకుడిని ప్రశ్నించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. శివరిత్వక మెగా మాల్‌ నిర్వాహకుడు కాశీవిశ్వనాథ్‌రెడ్డి నేరాన్ని అంగీకరించారు. అంతో ఇంతో వ్యాపారం బాగా జరుగుతున్న టైంలో పక్కనే పెద్ద మార్ట్ రావడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తన వ్యాపారం దెబ్బతింటుదన్న కోపంతో రగిలిపోయి మార్ట్‌ తగుల బెట్టాడు. మిత్రడు చెన్నారెడ్డితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.


మార్ట్‌ను తగలబెడితే ఇక ఆ ప్రాంతంలోనే ఉండరని అనుకొని.. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. రాత్రికిరాత్రే శానిటైజర్, పెట్రోల్‌తో తడిపిన గుడ్డలను వెంటిలేటర్ ద్వారా లోపలికి విసిరేశారు. దానికి నిప్పు పెట్టారు. ఎక్కడా ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే పోలీసులకు దొరికే ఛాన్స్ లేదనుకున్నారు. 


కానీ పూర్తి సాంకేతి ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.కేవలం వారి మీద నిఘా ఉంచి సాకేంతికంగా ఆధారాలు లభించిన తర‌్వాతే నిందితులను అరెస్ట్ చేశామన్నారు డీఎస్పీ. కాంపిటీషన్ వస్తే పోటీపడాలి కానీ ఇలాంటి నేరపూరిత పనులు చేస్తే ఎలా అంటున్నారు అనంతపురం పోలీసులు. టెక్నాలజీ వేగంగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో నిందితులను పట్టుకోవడం లేట్ అవచ్చేమో కానీ పూర్తిగా తప్పించుకోలేరు అన్నదానికి ఈ కేసే ఒక ఉదాహరణ అంటున్నారు అనంతపురం పోలీసులు.


Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!


Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?


Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి