Woman Tries To kill her Husband | మహబూబాబాద్: వివాహేతర సంబంధాలు ఒక్కరి జీవితాన్నే కాదు కొన్ని కుటుంబాలను బజారుకీడుస్తున్నాయి. కొన్ని సందర్భాలలో తమ జీవిత భాగస్వామి ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడటం లేదు. కొందరు పేగు తెంచుకు పుట్టిన పిల్లల్ని సైతం చంపి ప్రియుడితో పరారవుతున్నారు. కోరుకున్న మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు తనను నమ్మి వచ్చిన భార్యను, కన్నబిడ్డల ప్రాణాలు తీస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాల్లో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది.

Continues below advertisement

మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడెం తండాలో ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం తన ప్రియుడితో కలిసి వివాహిత తన భర్తపై కత్తితో దాడి చేసింది. ఈ క్రమంలో భర్త చెవులు కోసేసింది. బాధితుడు ప్రాణ భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించారు. వివాహిత ప్రియుడ్ని పట్టుకుని చితకబాదారు గడ్డిగూడెం వాసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

అసలేం జరిగిందంటే..మహబూబాబాద్ జిల్లాలోని గడ్డిగూడేనికి చెందిన ప్రసాద్ కు కొన్నేళ్ల కిందట ఓ మహిళతో వివాహం జరిగింది. ఇటీవల వివాహితకు ఇన్‌స్టాగ్రామ్ లో అనిల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి వ్యవహారం తెలిసి భర్త ప్రసాద్ ఇద్దర్నీ మందలించినట్లు తెలుస్తోంది. తమ వ్యవహారానికి అడ్డుగా ఉన్న భర్త ప్రసాద్ ను హత్య చేయాలని భార్య ప్లాన్ చేసింది. తన ప్రియుడు అనిల్ సహాయంతో భర్త ప్రసాద్  పై కత్తితో దాడికి పాల్పడింది. బాధితుడు ప్రసాద్ చెవి తెగిపోయి తీవ్రగాయమైంది. ప్రాణభయంతో కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని వివాహిత ప్రియుడు అనిల్ ను పట్టుకుని చితకబాదారు. అనంతరం చెట్టుకు కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు ప్రసాద్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వివాహిత, ఆమె ఇన్‌స్టా ప్రియుడు అనిల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Continues below advertisement

ఇటీవల ఓ వివాహిత తన భర్తను హత్య చేసేందుకు చెవిలో గడ్డి మందు పోయడం కలకలం రేపింది. పలు చోట్ల భర్తలు తమ భార్యను హత్యచేసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నాలు చేసి దొరికిపోతున్నారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి చంపుతున్న ఘటనలు సైతం పెరిగిపోయాయి.