Married but the bride ran away with money and gold: మగపిల్లలు.. మగవాళ్లు అయి.. వయసుదాటిపోతున్నా పెళ్లి కావట్లేదు. ఇలాంటి వారిని టార్గెట్ చేసుకుని కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు.   

Continues below advertisement

దొంగతనం కోసం పెళ్లి చేసుకున్న యువతి        

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఒక గ్రామంలో ఆలస్యంగా  ఇలాంటి మోసం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన 25 ఏళ్ల యువతి  సుమిత్రా ప్రియదర్శిని అనే యువతి ప్రియా పేరుతో పెళ్లి సంబంధం ఖరారు చేసుకున్నారు.  పెళ్లి చేసుకుని, వరుడి ఇంటి నగలు, నగదులతో పరారైంది. రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారం తీసుకుని  వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.        

Continues below advertisement

పరిచయం పెంచుకుని చాటింగ్‌ చేసి నమ్మకంగా పెళ్లి        

మ్యాట్రిమోనీ సైట్‌లో తనను 'అనాథ'గా చూపించుకుని, ఫేక్ తల్లిదండ్రులు, బంధువులతో పెళ్లి జరిపించుకున్నట్లు తెలిసింది. గతంలో మరో ఇద్దరు యువకులను  ఇలాగే  మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పర్వతగిరి మండలం లోని 28 ఏళ్ల యువకుడు  గత ఏడాది మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకున్నాడు. అక్కడ 'ప్రియా' పేరిట ఒక ప్రొఫైల్‌కు ఆకర్షితుడయ్యాడు.  విజయవాడకు చెందిన పేద కుటుంబానికి చెందిన అనాథ  అమ్మాయిగా ప్రియా పరిచయం చేసుకుంది. మెకానికల్ ఇంజనీరింగ్  చదివానని చెప్పుకున్న  ఆమె, రమేష్‌తో చాటింగ్‌  మొదలుపెట్టింది. మూడు నెలల చాటింగ్ తర్వాత, విజయవాడలో ఒక   హోటల్‌లో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లికి ముందు వీడియో కాల్‌ల ద్వారా బంధువులను చూపించింది.  కానీ, ఇదంతా ఫేక్‌గా ఉందని, ఆ బంధువులు అంతా  ఫేక్ అని పెళ్లి తర్వాత తెలిసింది. 

పెళ్లి తర్వాత రోజే ఇంట్లో బంగారం, నగదు తీసుకుని జంప్              

పెళ్లి తరవాత రమేష్ కుటుంబం ఆమెను ఇంటికి తీసుకువచ్చింది. మరుసటి రోజు ఉదయం మేకప్ చేసుకుని షాపింగ్‌కు వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ తిరిగి రాలేదు. ఇంట్లో చెక్ చేస్తే  రూ.2 లక్షల నగదు, రమేష్ తల్లి, సోదరికి చెందిన 8 తులాల బంగారం కనిపించలేదు. ఎంత ప్రయత్నించినా ప్రియా కాల్ కలవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణలో సంచలన విషయాలను కనిపెట్టారు.              

గతంలో రెండు సార్లు ఇలాగే మోసాలు చేసినట్లు గుర్తించిన పోలీసులు          

ప్రియా గతంలో మరో ఇద్దరు యువకులను ఇలాగే మోసం చేసినట్లు తేలింది. 2024లో ఖమ్మం జిల్లాలో ఒక 30 ఏళ్ల యువకుడిని మ్యాట్రిమోనీ సైట్ ద్వారా మోసం చేసి, రూ.1.5 లక్షలు, 5 తులాల బంగారం తీసుకుని పరారైంది. మరోసారి విజయవాడలోనే ఒక 26 ఏళ్ల ఐటీ ఉద్యోగిని మోసం చేసి, రూ.3 లక్షలు డిపాజిట్ చేయించుకుని అదృశ్యమైంది. ఈ మోసాల్లో ఆమె ఫేక్ ఐడీలు, ఫోటోలు ఉపయోగించినట్లు తెలిసింది. పోలీసులు ఆమెను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ రికార్డులను స్కాన్ చేస్తున్నారు.