VRA Murder in Mancherial District: మంచిర్యాల జిల్లాలో (Mancherial) ఓ ప్రభుత్వ ఉద్యోగి దారుణ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి (Kannepalli) ఎమ్మార్వో కార్యాలయంలో వీఆర్ఏ హత్యకు (VRA Murder) గురయ్యాడు. కొత్తపల్లి వీఆర్‌ఏ (Kothapalli VRA) అయిన దుర్గం బాబును గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న దుర్గం బాబును స్థానికులు గుర్తించి పరిశీలించగా.. అప్పటికే అతను కదల్లేని స్థితిలో ఉన్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. 


అయితే, ఓ రెవెన్యూ ఉద్యోగి హత్యకు గురి కావడం జిల్లాలో సంచలనం అయింది. వ్యక్తిగత కక్షలతో వీఆర్‌ఏ హత్య (VRA Murder) జరిగిందా లేదా ఏదైనా రెవెన్యూ సంబంధిత లావాదేవీనా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధికారుల మధ్య విబేధాలతో అది హత్యకు దారి తీసిందా అనే కోణంలో కూడా పోలీసులు హత్య చోటుచేసుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 


దుర్గం బాబు కొత్తపల్లికి (Kothapalli) గ్రామ రెవెన్యూ సహాయకుడు (VRA)గా పని చేస్తున్నాడు. మంచిర్యాల జిల్లా (Mancherial District) కన్నెపల్లి తహసీల్దార్‌ (Kannepalli MRO Office) కార్యాలయంలో రాత్రిపూట విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులను పిలిపించి వారికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అన్నది పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని సీఐ బాబురావు వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.


కొత్తపల్లి గ్రామంలో ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా చంపేస్తామని బెదిరిస్తున్నారని దుర్గం బాబు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అదే విషయంపై గతంలో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అతనే దుర్గం బాబును హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.


గతంలోనూ తహసీల్దార్ ఆఫీసుల్లో దాడులు
తహసీల్దార్ ఆఫీసులపై దాడులు జరిగడం ఇదేం మొదటిసారి కాదు. హైదరాబాద్ శివారులో తహసీల్దార్ విజయా రెడ్డిపై పెట్రోల్ పోసిన ఘటన కొన్నేళ్ల క్రితం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతేడాది మెదక్ జిల్లా శివ్వం పేటలో తహసీల్దార్ పై రైతులు డీజిల్ పోసిన ఘటన చోటు చేసుకుంది. సకాలంలో తహసీల్దార్ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకపోవడం వల్ల విద్యుత్ షాక్ తో ప్రాణాలు పోగొట్టుకున్న రైతుకు బీమా డబ్బులు రాలేదని ఆరోపిస్తూ రైతులు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి తహసీల్దార్ పై దాడికి ప్రయత్నించారు. ఆఖరికి హైదరాబాద్ షేక్ పేటలో ఎమ్మార్వోపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. గద్వాల విజయలక్ష్మి నగర మేయర్ కాక ముందు ఆమె అనుచరులతో కలిసి బెదిరించారని ఆయన అప్పట్లో అన్నారు.