Murder in OYO Hotel:  



ఢిల్లీలో హత్య..


ఢిల్లీలోని ఫరియాబాద్‌లో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తి మహిళను ఓయో హోటల్‌లోనే హత్య చేశాడు. తనతో కాకుండా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న కక్షతో హోటల్‌ రూమ్‌లో హతమార్చాడు 24 ఏళ్ల యువకుడు. ఢిల్లీలోని ఓ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న ఆకాశ్...ఓ మహిళతో దాదాపు 8 ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే..ఈ మధ్య తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని, వేరే వ్యక్తికి దగ్గరవుతుందన్న అనుమానంతో హోటల్‌కి పిలిచి హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఫరియాబాద్‌లోని NHPC చౌక్ వద్ద ఓయో హోటల్‌కి రావాలని ఆ మహిళకు చెప్పాడు. రూమ్‌లోనే ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఆవేశంతో ఊగిపోయిన ఆకాష్..తాడుతో ఉరి బిగించి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. హోటల్‌లో ఉన్న నిందితుడుని అరెస్ట్ చేశారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మహిళను చంపేందుకు వినియోగించిన తాడునీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మర్డర్ కేస్ నమోదు చేసి...రిమాండ్‌లోకి తీసుకున్నారు. కేసుని విచారించిన తరవాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ము


ముంబయిలో దారుణం..


ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గీతానగర్‌లోని ఫేజ్‌-7 లో ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్‌ గురించి తెలియలేదు. అప్పటికే స్పాట్‌లో ఉన్న నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధావాకర్  హత్యను గుర్తు చేసింది ఈ మర్డర్. బాడీని ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పారేయాలని అనుకున్నాడు. వాటిని కట్ చేయడానికి కట్టర్ మెషీన్‌ని వాడాడు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న ఆమె బాడీని కనిపించకుండా చేయాలని ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు. 


యూపీలో కూడా.. 


యూపీలోనూ మరో హత్య జరిగింది. ప్రియురాలిని దారుణంగా చంపిన ఓ యువకుడు...డెడ్‌బాడీని ఇంటిపై ట్యాంక్‌లో దాచి పెట్టాడు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి ఎవరి కంటా పడకుండా ట్యాంక్‌లో పడేశాడు. మహేవాలో ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతురాలు రాజ్‌ కేసర్‌ బాడీని స్వాధీనం చేసుకున్నారు. అరవింద్ అనే యువకుడు ఆమెను హత్య చేసినట్టు తెలిపారు. అయితే...ఈ మర్డర్ రెండు వారాల క్రితమే జరగ్గా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


Also Read: బాలుడిని మింగేసిన మొసలి, కోపంతో కొట్టి చంపిన గ్రామస్థులు