Belgium Crime: 


బెల్జియంలో దారుణ హత్య..


బెల్జియంలో ఓ 30 ఏళ్ల వ్యక్తి కన్న తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ఆ తరవాత డెడ్‌బాడీని సమీపంలోని ఓ కాలువలో పడేశాడు. పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఈ మర్డర్ గురించి చెప్పాడు. వెంటనే అలెర్ట్ అయ్యి ఆ ప్లేస్‌కి వెళ్లిన పోలీసులకు ఏ ఆచూకీ దొరకలేదు. ఫేక్ కాల్ అయ్యుంటుందిలే అని వదిలేశారు. ఆ తరవాత కాల్వలో ఓ రిఫ్రిజిరేటర్ కనిపించింది. దాన్ని బయటకు తీసి చూస్తే ఓ మహిళ శరీర భాగాలు కనిపించాయి. రెండు చేతులు, రెండు కాళ్లు అందులో పెట్టి కాల్వలో పడేశాడు నిందితుడు. సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు మరో కంటెయినర్ దొరికింది. అందులో తల, మొండెం కనిపించాయి. ఆమె గోళ్లు, జ్యువెల్లరీ, టాటూల ఆధారంగా ఆచూకీ కనిపెట్టారు. అప్పటికే నిందితుడు అప్రమత్తమై సౌత్ కొరియాకు పారిపోవాలని స్కెచ్ వేశాడు. కానీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే తన తల్లిని హత్య చేసినట్టు అంగీకరించాడు. ప్రాథమిక వివరాల ప్రకారం ఈ హత్య జులై 10న జరిగింది. తానే తన తల్లిని చంపేసి శరీరాన్ని ముక్కలు చేసి కాల్వలో పడేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు. చాలా రోజులుగా తల్లి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయని విచారణలో తేలింది. మాటమాటా పెరిగి కోపంతో తల్లిని చంపేశాడు కొడుకు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 


ఢిల్లీలోనూ ఈ తరహా దారుణం..


దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈ తరహా ఒళ్లు జలదరించే క్రైమ్ జరిగింది. గీతా కాలనీలోని ఓ ఫ్లైఓవర్ సమీపంలో ఓ మహిళ శరీర భాగాలు కనిపించడం సంచలనమైంది. శ్రద్ధా వాకర్‌ దారుణంగా హత్య చేసిన కేసు నుంచే ఇంకా కోలుకోక ముందే దాదాపు అలాంటి నేరమే వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్లైఓవర్‌ దగ్గర్లో పడేశారు దుండగులు. జులై 12న 9 గంటలకు పోలీసులకు ఈ సమాచారం అందింది. శరీర భాగాలు ఒక్కోటి ఒక్కో చోట పడేసి ఉన్నాయి. ఆమె తలని స్వాధీనం చేసుకున్నారు. మిగతా శరీర భాగాల కోసం అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ తరహా నేరాలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. హత్య చేయడమే కాకుండా బాడీని ముక్కలుగా నరికి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. సాక్ష్యాధారాలు దొరక్కుండా నేరస్థులు ఇలా జాగ్రత్త పడుతున్నారు. ఈ కేస్‌లను డీల్ చేయడంలో పోలీసులూ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. సంఘటనా స్థలంలో రెండు ప్లాస్టిక్ బ్యాగ్‌లు దొరికాయని పోలీసులు వెల్లడించారు.


"రెండు  బ్లాక్ పాలిథీన్ బ్యాగ్‌లు కనిపించాయి. ఓ బ్యాగ్‌లో మహిళ తల ఉంది. మరో సంచిలో మిగతా శరీర భాగాలున్నాయి. జుట్టు చాలా పొడవుగా ఉండడం వల్ల చనిపోయింది మహిళే అని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చాం. మహిళా కాదా అన్నది పూర్తి విచారణ తరవాతే తెలుస్తుంది"




 - పోలీసులు

 

Also Read: Manipur Violence: ఇదంతా విపక్షాల షో ఆఫ్ మాత్రమే, ఎంపీల మణిపూర్ పర్యటనపై కేంద్రమంత్రి సెటైర్లు
 

" target="_blank">
Manipur Violence: ఇదంతా విపక్షాల షో ఆఫ్ మాత్రమే, ఎంపీల మణిపూర్ పర్యటనపై కేంద్రమంత్రి సెటైర్లు