Khammam News: ఆస్తి కోసం దారుణం - తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య

Telangana News: ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి ఆస్తి కోసం తన తల్లి, ఇద్దరు కుమార్తెలను హతమార్చి పరారయ్యాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Continues below advertisement

Man Kills Mother And Two Daughters In Khammam: ఖమ్మం (Khammam) జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ వ్యక్తి తన తల్లి, ఇద్దరు కూతుళ్లను హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తల తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. తన పేరుపై ఆస్తి రాసివ్వలేదని కోపం పెంచుకున్న వెంకటేశ్వర్లు.. తల్లి పిచ్చమ్మ (60)ను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ (10), ఝాన్సీలను చంపి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొలం తన పేరుపై రాయాలని కొన్నేళ్లుగా తల్లిని వెంకటేశ్వర్లు వేధిస్తున్నట్లు సమాచారం. వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. రెండేళ్ల క్రితం భార్యను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

Continues below advertisement

Also Read: Courtallam Waterfall: ఉప్పొంగిన జలపాతం- ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇంటర్ విద్యార్థి

Continues below advertisement
Sponsored Links by Taboola