Hyderabad Crime News: ఇటీవల నేరాలు ఎక్కువైపోయితున్నారు. కావాలని కాకపోయినా... క్షణికావేశాల్లో జరుగుతున్న నేరాలు కూడా పెరిగిపోతున్నారు. కోపం, ఆవేశంతో... ఏం చేస్తున్నారో తెలియనిస్థితిలో హత్యలు చేసేస్తున్నారు. ఒళ్లు  తెలియకుండా... కొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు అతిగా అవేశపడి... ప్రాణాలు తీసేవరకు వెళ్తున్నారు. అమ్మ తిట్టిందనో... సెల్‌ఫోన్‌ ఇవ్వలేదనే.. ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు కూడా ఇటీవల కాలంలో  జరుగుతున్నాయి. మరోవైపు... సొంత వారితో గొడవ పడి ఒళ్లు తెలియని కోపంతో వారి ప్రాణాలు తీసున్నారు కొంత మంది. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని మధురానగర్‌లో జరిగింది. షూ విషయంలో అన్నదమ్ముల మధ్య  జరిగిన గొడవలో తమ్ముడు ప్రాణాలు కోల్పాయాడు. అన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అసలు ఏం జరిగిందే...?
రాణి, సరోజ అక్కాచెల్లెళ్లు. సరోజ కూతురు మార్త నిజాంపేటలో ఉంటోంది. మార్తకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు సంగెపాగు ప్రవీణ్‌ మోజెస్‌(20) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌ మోజెస్‌కు వరుసకు అమ్మమ్మ  అయ్యే రాణి రహ్మత్‌నగర్‌లోని జవహర్‌నగర్‌లో ఉంటోంది. ఈమెకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు అభిలాష్‌ అలెక్స్‌, అభిషేక్‌ అలెక్స్‌. అయితే... సెల్‌ఫోన్‌ రిపేరు కోసం... ప్రవీణ్‌ మోజెస్‌ ఈనెల 4వ తేదీ రాత్రి అమ్మమ్మ రాణి ఇంటికి వెళ్లాడు. రాణి  పెద్ద కుమారుడు అభిలాష్‌తో కలిసి ఈనెల 5వ తేదీన ఉదయం ఎర్రగడ్డలోని సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాపుకు వెళ్లాడు. ఇద్దరూ కలిసి రాత్రికి ఇంటికి వచ్చారు. అభిలాష్‌ తమ్ముడు అభిషేక్‌ అలియాస్‌ బన్నీ... బూట్లు విప్పకుండానే నిద్రపోతున్నాడు. దీంతో  అభిలాష్‌ గొడవ పడ్డారు. షూ తీసేసి పడుకోవాలని చెప్పారు. దీంతో అన్నదమ్ములు అభిలాష్‌, అభిషేక్‌ మధ్య గొడవ జరిగింది. దీంతో ప్రవీణ్‌ మోజెస్‌ కలుగజేసుకున్నాడు. చిన్న విషయానికి ఎందుకు గొడవపడతారని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.  ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన అభిషేక్‌... క్షణికావేశంలో ప్రవీణ్‌పై దాడి చేశారు. కత్తిలో పొడిచేశాడు. ప్రవీణ్‌ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో... అతన్ని వెంటనే అమీర్‌పేట్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే ప్రవీణ్‌  మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 


చిన్న సమస్య... మాటలతో సర్దుకునే వివాదం... ఒకరి ప్రాణాలు తీసే వరకు వరకు వెళ్లింది. ఇంకొకరిని జైలు పాలు చేసింది. ఈ సంఘటనలో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒక తల్లికి కడుపుకోత మిగిల్చింది. ఈ కేసులో మధురానగర్‌  పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివాదానికి అసలు కారణం ఏంటి...? కత్తితో దాడి చేసే వరకు ఎందుకు వెళ్లింది.. అనే వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబసభ్యులను కూడా ప్రశ్నిస్తున్నారు.