సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ కు బాంబ్ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆల్ఫా హోటల్ లో బాంబులు పెట్టే విషయమై కొంతమంది చర్చిస్తున్నారని ఆ వ్యక్తులను చూపిస్తానంటూ గౌస్ పాషా అనే వ్యక్తి 100 కు కాల్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆల్ఫా హోటల్ కు చేరుకున్నారు. తమకు కాల్ చేసిన గౌస్ పాషా కు పోలీసులు ఫోన్ చేయగా అతని ఫోన్ కలవకపోవడంతో వెంటనే పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేయించారు. చివరికి బాంబు లేదని తేల్చిన పోలీసులు ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడు గౌస్ పాషాను పోలీసులు పట్టుకున్నారు.


ఆల్ఫా హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ 
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్‌కు శనివారం రాత్రి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆ హోటల్, చుట్టు పక్కల పరిసరాలు నిత్యం రద్దీగా ఉంటుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. బాంబు ఉందని ఓ అజ్క్షాత వ్యక్తి ఫోన్ చేసినట్లు తెలిసింది. శనివారం రాత్రి 10.45 గంటలకు 100 నంబర్‌కు ఫోన్ చేసి ఆగంతుకుడు బెదిరించాడు. వెంటనే పోలీసులు ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న హోటల్ సిబ్బందిని బయటకు పంపించేసి.. హోటల్ ను మూసేసి 2 గంటల పాటు లోపల బాంబు కోసం వెతికారు. చివరకు ఆ హోటల్‌లో బాంబు లేదని బాంబ్ స్క్వాడ్ తేల్చారు. ఫోన్ చేసింది ఆకతాయి అని వివరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామని డీసీపీ సుబ్బారాయుడు, ఏసీపీ శివమర్తి వెల్లడించారు.