Drugs Seized in Hyderabad City | హైదరాబాద్ లో డ్రగ్స్ దందా పెరుగుతున్న కొద్దీ కట్టడి చేసేందుకు ఖాకీల నిఘా అంతేస్దాయిలో పెరుగుతోంది. పోలీసుల కళ్లుగప్పి డ్రగ్స్ సరఫరా కొనసాగించినప్పటికీ ఏదో విధంగా ఖాకీలకు అడ్డంగా దొరికిపోతున్నాగరు. ఇన్నాళ్లు హైదరాబాద్ పోలీసులు ఎంతో మంది నైజీరియన్లను , వారి అండతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వందల కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. అయితే అవసరాలు ఎంతకైనా తెగించేలా చేస్తాయి , ఇప్పుడు డ్రగ్స్ సరఫరా చేసే డ్రగ్ పెడ్లర్లు తమ అవసరాలకు, వేగంగా డబ్బు సంపాదించాాలనే అత్యాశకు పోయి ఎంతకైనా తెగిస్తున్నారు. కొందరైతే అవసరమైతే తమను పట్టుకోబోియిన పోలీసులను సైతం కాల్చేందుకు సిద్దమవుతున్నారు.
డ్రగ్స్ గ్యాంగ్ అరెస్ట్
తాాజాగా హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సాప్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 9మందిని అదుపులోకి తీసుకున్నారు. 300 గ్రాముల కొకైన్ , 11 ఎక్ స్టిసీ పిల్స్, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిలో నైజీరియన్లతో చేతులు కలిపిన లోకల్ బాయ్స్ కూడా ఉన్నారు. అయితే వీళ్లు ఏకంగా తేడా వస్తే ఖాకీలనే లేపేసేందుకు గన్ సిద్దం చేసుకున్నారంటే ఎంతలా బరితెగించారో అర్దం చేసుకోవచ్చు.
లవ్ ఫెయల్ కావడంతో డ్రగ్స్‌కు బానిస
హైదరాబాద్ కు చెందిన హర్షవర్దన్ అనే సాప్ట్ వేర్ ఉద్యోగి. ఓ అమ్మాయిని ప్రేమించి , ఆమె పెళ్లికి నిరాకరించడంతో డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. డ్రగ్స్ తీసుకుని విధులు నిర్వహిస్తుండగా గుర్తించడంతో ఉన్న ఉద్యోగం కాస్తా పోయింది. డబ్బు సులువుగా సంపాదించాలి, డ్రగ్స్ అలవాటును కొనసాగించాలని భావించి, గోవాలో ఉన్న కొందరు ప్రెండ్స్ ను కలిశాడు. వారి సహాయంతో గోవా నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తెచ్చి , ఇక్కడ సాప్ట్ వేర్ ఉద్యోగులు, సీఈవోలకు అత్యంత ఖరీదైన సింథటిక్ డ్రగ్స్ ను విక్రయిస్తున్నాడు. హర్షవర్దన్ పై నిఘాపెట్టిన పోలీసులు అదులపులోకి తీసుకున్నారు.
ఈజీ మనీ కోసం డ్రగ్స్ విక్రయాలు
హైదరాబాద్ లో కిరాణా షాపు నడుపుతున్న ముజఫర్ వహీద్ కు ఇటీవల లాభాలు తగ్గడంతో ఈజీ మనీపై దృష్టిపడింది. మహారాష్ట్రలోని తన స్నేహితులను కలిసాడు. తక్కువ ధరకు డ్రగ్స్ కు ఇప్పించండి హైదరాబాద్ లొో అమ్ముకుంటానని చెప్పాడంతో ముంబైకి చెందిన ఇద్దరు నైజీరియన్లను పరిచయం చేశారు స్నేహితులు. ముంబై నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు ఓ డెలివరీ బాయ్ ను ఏర్పాటు చేసుకున్నాడు వహీద్. హైదరాబాద్ తెచ్చిన డ్రగ్స్ ను ఇక్కడ వివిధ పారిశ్రామిక వేత్తలకు అమ్మేవాడు. ఇలా వహీద్ వద్ద డ్రగ్స్ కొంటున్న 59 మంది పారిశ్రామిక వేత్తలను గుర్తించారు పోలీసులు. ముజఫర్ తో పాటు నలుగురు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయాలు
గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నరాజస్దాన్ కు చెందిన జితేందర్ అలియాస్ జిత్తు, హైదరాబాద్ లో ఓ స్వీట్ షాపు నిర్వహించేవాడు. స్వీట్ షాపు నష్టాలు రావడంతో డ్రగ్స్ దందాపై జిత్తు కన్నుపడింది. రాజస్దాన్ లో ఈజీగా దొరికే ఎండీ డ్రగ్స్ హైదరాబాద్ కు తెచ్చి అమ్మేవాడు. గత కొంతకాలంగా ఓ గ్యాంగ్ ను తయారు చేసి డ్రగ్స్ అమ్ముతూ భారీగా లాాభాలు పొందాడు. అయితే తమను పోలీసులు పట్టుకుంటే దందా ఆగిపోతుంది. తాను జైలు పాలవుతాడని గ్రహించి, పోలీసులపై అవసరమైతే ఫైరింగ్ జరిపేందుకు సిద్దంగా ఉండాలని భావించి, రాజస్దాన్ వెళ్లి ఓ అటోమెటిక్ గన్ తెచ్చుకున్నాడు. జిత్తు డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న పోలీసులు జిత్తు అండ్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకోవడంతోపాటు గన్, ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
జిత్తు అరెస్ట్ తో హైదరాబాద్ పోలీసులలో కొత్త కలవరం మొదలైయ్యింది. ఇప్పటి వరకూ హైదరాబాద్ పోలీసులు డ్రగ్ పెడ్లర్ల వద్ద గన్ స్వాధీనం చేసుకోలేదు. వాళ్లు గన్ ఉపయోగించడం గుర్తించలేదు. పోలీసులే టార్గెట్ గా ఓ డ్రగ్ పెడ్లర్ గన్ కొనడం, అవసరమైతే ఎదురు తిరిగేందుకు బుల్లెట్స్ ను సైతం సిద్దం ఉంచుకోవడం గతంలో ఎప్పుడూ లేదని పోలీసు ఉన్నాధికారులే చెబుతున్నారంటే పరిస్దితి అర్దం చేసుకోవచ్చు. ఇలా నైజీరియన్ల సహాయంతో లోకల్ కేటుగాళ్లు చేతులు కలిపి , వేగంగా అడ్డదారిలో డబ్బు సంపాదించడమేకాకుండా, ఖాకీలను అంతం చేసేందుకు గన్ సిద్దం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇకపై డ్రగ్ పెడ్లర్లను అదుపులోకి తీసుకోవడం అంటే హైదరాబాద్ పోలీసులకు ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిన పరిస్దితులు ఏర్పాడ్డాయి.