Honor Killing: మధ్యప్రదేశ్ లో జరిగిన ఘోర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులకు ఇష్టం లేకుండా వేరొకరిని ప్రేమిస్తుందని.. వారిద్దరినీ కిరాతకంగా చంపేశారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను నదిలో మొసళ్లకు ఆహారంగా వేశారు. ఈ దారుణ ఘటన ఈ నెల 3 వ తేదీన జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. 


మధ్యప్రదేశ్ మొరెనా జిల్లాలోని రతన్ బసాయి గ్రామానికి చెందిన శివాని తోమర్(18), బలుపురాకు చెందిన రాధేశ్యామ్ (21) లు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇది శివాని ఇంట్లో తెలియడంతో వారు కోపోద్రిక్తులయ్యారు. ఇద్దరీ ఎలాగైనే చంపాలని పక్కాగా పథకం పన్నారు. జూన్ 3వ తేదీన శివాని, రాధేశ్యామ్ ఇద్దరినీ తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం వారి మృతదేహాలకు బరువైన బండ రాళ్లు కట్టేసి.. మొసళ్లు సంచరించే నదిలో విసిరేశారు. ఈ క్రమంలో రాధేశ్వామ్ కనిపించడం లేదని ఆయన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు ఒప్పుకోవట్లేదని ఇద్దరూ పారిపోయి ఉంటారని మొదట భావించారు పోలీసులు. అయితే వీరిద్దరూ వెళ్లిపోవడాన్ని ఎవరూ చూడకపోవడంతో పోలీసులకు కొంత అనుమానం వచ్చింది. ఆ తర్వాత ఇరు వైపుల కుటుంబసభ్యులను, బంధు మిత్రులను ప్రశ్నించారు. ఆఖరిని యువతి తండ్రిని ప్రశ్నించగా.. తను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. శివాని, రాధేశ్యామ్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా వేరే అబ్బాయిని ప్రేమించిందని అది తట్టుకోలేక ఇద్దరీ చంపేసినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత రాళ్లు కంటి చంబల్ నదిలో పడేసినట్లు చెప్పాడు. చంబర్ ఘరియాల్ అభయారణ్యంలో 2000 కంటే ఎక్కువే ఎలిగేటర్లు, 500లకు పైగా మంచి నీటి మొసళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు చంబల్ నదిలో మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. 


యూపీలో దారుణం


ఈమధ్యే యూపీలో ఓ యువకుడు తన ప్రియురాలిని దారుణంగా చంపాడు. అనంతరం డెడ్‌బాడీని ఇంటిపై ట్యాంక్‌లో దాచి పెట్టాడు. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి ఎవరి కంటా పడకుండా ట్యాంక్‌లో పడేశాడు. మహేవాలో ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. మృతురాలు రాజ్‌ కేసర్‌ బాడీని స్వాధీనం చేసుకున్నారు. అరవింద్ అనే యువకుడు ఆమెను హత్య చేసినట్టు తెలిపారు. అయితే...ఈ మర్డర్ రెండు వారాల క్రితమే జరగ్గా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మే 30వ తేదీన మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాడు నిందితుడు అరవింద్. విచారణ జరిపిన పోలీసులు...ఆమె కాల్‌ హిస్టరీని చెక్ చేశారు. ఆ తరవాత అనుమానంతో నిలదీశారు. వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారించారు. అప్పుడు కానీ అసలు విషయం బయటపడలేదు. ప్రస్తుతానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. 


ముంబయిలోనూ దారుణం..


ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్‌ గురించి తెలియలేదు.