Bhopal Crime News: 


డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లో దారుణం..


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణమైన ఘటన జరిగింది. డాగ్‌ ట్రైనింగ్ సెంటర్‌లో గేట్‌కి ఓ కుక్కను చంపి వేలాడదీశారు. ఇది చూసి స్థానికులు, అధికారులు షాక్ అయ్యారు. కుక్క మెడకు గొలుసు కట్టి గేట్‌కి వేలాడదీశారు. పైగా ఈ పని చేసింది డాగ్ ట్రైనింగ్‌ సెంటర్‌లోని సిబ్బందే. ఇద్దరు ఉద్యోగులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. అంతే కాదు. CC కెమెరాలో ఈ ఫుటేజ్‌ రికార్డ్ అవ్వకుండా డిలీట్ చేసేందుకూ ప్రయత్నించారు. వివరాల్లోకి వెళ్తే...మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌కి చెందిన ఓ బిజినెస్‌ మేన్ రెండేళ్లుగా ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ ఏడాది మే నెలలో ట్రైనింగ్ ఇప్పించేందుకు ఈ సెంటర్‌కి తీసుకొచ్చాడు. నెలకి రూ.13 వేల మేర వసూలు చేస్తోంది ఈ డాగ్ ట్రైనింగ్ సెంటర్. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ట్రైనింగ్ పూర్తవ్వాల్సి ఉంది. అయితే...అక్టోబర్ 9వ తేదీన కుక్క ఉన్నట్టుండి చనిపోయిందని ఓనర్‌కి చెప్పారు ఇద్దరు ఉద్యోగులు. అనుమానం వచ్చిన ఓనర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుక్కను చంపి గేట్‌కి వేలాడదీసినట్టు విచారణలో తేలింది. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని కూడా సేకరించారు పోలీసులు. 


కేరళలో ఊహించని ఘటన..


ఇటీవలే కేరళలోని కొట్టాయంలో ఓ డ్రగ్స్ డీలర్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన Anti-Narcotics Squad పోలీసులకు ఊహించని అనుభవం ఎదురైంది. ఖాకీ డ్రెస్ వేసుకున్న వాళ్లను కరిచే విధంగా ట్రైనింగ్ ఇచ్చిన కుక్కలు ఆ ఇంట్లో కనిపించాయి. అవి చాలా క్రూరంగా ఉన్నాయట. ఫలితంగా సోదాలు చేయడం పోలీసులకు సవాలుగా మారింది. అవి నిందితుడైన యజమాని తప్పించుకునేందుకు సహకరించడమే కాదు. డ్రగ్స్‌ని సీజ్ చేయకుండా కూడా ఆపేశాయని పోలీసులు వెల్లడించారు. వాటికి ఆ రేంజ్‌లో ట్రైనింగ్ ఇచ్చారన్నమాట. చాలా సేపు శ్రమించి మొత్తానికి ఆ కుక్కల్ని లొంగదీసుకున్నారు పోలీసులు. ఆ తరవాత ఇంట్లో సోదాలు చేసి 17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొట్టాయం పోలీసులకు ఎదురైన ఈ వింత అనుభవం గురించి కేరళ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొట్టాయం ఎస్‌పీ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పడం వల్ల ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా కూడా కుక్కలకు ట్రైనింగ్ ఇస్తారా అని షాక్‌ అవుతున్నారు. ఇంకా కీలక విషయం ఏంటంటే పైకి అలా డాగ్ ట్రైనర్‌గా కనిపిస్తూనే అక్రమంగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. చాలా రోజులుగా ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. చాలా మంది తమ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు వాటిని ఇక్కడే వదిలి వెళ్తున్నారు. అందుకోసం రోజుకి రూ.1000 ఛార్జ్ చేశాడని స్థానికులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. సోదాలు చేయడానికి వెళ్లినప్పుడు 13 కుక్కలు కనిపించాయి. స్పెషల్ టీమ్‌తో ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుపుతున్నట్టు వివరించారు. 


Also Read: Himanta Biswa Sarma: పవార్ జీ, మీ కూతురిని పాలస్తీనా పంపండి - శరత్ పవార్‌కు హిమంత బిశ్వా శర్మ కౌంటర్