Krishna Crime: ఫైనాన్స్ విషయంలో మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులతో ఉయ్యూరులో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్తకు చెందిన ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న భార్య తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
భీమవరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వాణి భర్త కుమార్ వద్ద ఉయ్యూరుకు చెందిన వినాయక్ బాబు ఫైనాన్స్ పద్ధతిలో లారీ కొనుగోలు చేశాడు. ఈ విషయంలోనే వివాదం రేగింది. ఇది ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. లారీ కొనుగోలు సమయంలో అగ్రిమెంట్ రాలేదు. అయితే అగ్రిమెంట్ వస్తుందనే ధీమాతో ఆయన 3 లక్షలు ఖర్చు చేసి లారీకి మరమ్మతులు పూర్తి చేశాడు. అయితే 40 రోజులు అయినా రాసుకున్న అగ్రిమెంట్ రాలేదు. Also Read : ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
40 రోజుల దాటిన కొనుగోలు చేసిన వ్యక్తి వినాయక్ బాబు పేరు మీద లారీని మార్చేందుకు కుమార్ ముందుకు రాలేదు. ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. చివరకు వివాదం తొలుత భీమవరం పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ జరిగింది. కుమార్ భార్య భీమవరంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ కావడంతో వివాదంపై ప్రభావితం చూపారని బాధితులు వాపోతున్నారు. భీమవరం పంచాయితీ తర్వాత మొదట పడమట, ఆ తర్వాత పెనమలూరు పోలీస్ స్టేషన్లో వినయ్‌బాబుపై కుమార్ కేసులు పెట్టారు. Also Read : గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో రెండు రోజుల పాటు కేసు విచారణ చేపట్టారు. కుమార్ భార్య ఎక్సైజ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల అండదండలతో వేధింపులకు పాల్పడ్డారని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా కుమార్ భార్య కానిస్టేబుల్ పెనమలూరు పోలీస్ స్టేషన్‌లోనే బాధితులను బెదిరించిందని అంటున్నారు. చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.
పోలీసు స్టేషన్‌లోనే తమకు న్యాయం జరగడం లేదని వినయ్‌బాబు భార్య మానసిక ఆందోళనకు గురయ్యారు. ఆవేదనతో నేడు ఉయ్యూరులో వినాయక్ బాబు, ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేశారు. ఉయ్యూరులో కాలువలో వినాయక్ బాబు దూకాడు. అతన్ని స్థానికులు కాపాడారు.
Also Read : హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులతో విసిగిపోయి వినాయక్ బాబు భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఎలుకల మందు తినడంతో హుటాహుటిన ఉయ్యూరు ప్రభుత్వ హాస్పటల్‌కు తరలించారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
