అయిదేళ్లుగా సాన్నిహిత్యంగా ఉంటున్న వారిలో ఒక్క సారిగా మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొన్ని రోజులుగా ఎడ మొహం పెడ మోహంగా ఉన్నారు. తన గురించి తప్పుగా మాట్లాడడం, గేలి చేయడం మానసికంగా చులకనగా చూడడం తట్టుకోలేక పోయాడు. కక్ష పెంచుకున్నాడు. చివరకు హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. మద్యం సేవిస్తూ మాట్లాడుకుందాం అని పిలిపించాడు. స్నేహితులతో కసితీరా పొడిచి చంపేశాడు. డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం జాన్నాడ శివారు పంట కాలువలో లభ్యమైన హిజ్రా మృతి కేసు మిస్టరీ ఛేదించారు పోలీసులు. హిజ్రాను హత్య చేసిన ముగ్గురి నిందితులను అరెస్ట్ చేశారు.
బుధవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఖాదర్ భాషా వివరాలను వెల్లడించారు.
జొన్నాడ పంట కాలువలో హిజ్రా మృతదేహం...
మే నెల 13 తేదీ రాత్రి ఆలమూరు మండలం జొన్నాడ గ్రామ శివారు, ఎన్ హెచ్ 216ఏ రహదారిని ఆనుకొని పంటకాలువలో ధవళేశ్వరం గ్రామానికి చెందిన మరపట్ల ఆనంద్ అలియాస్ ఆనంది అనే హిజ్రాని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో చంపినట్లు సమాచారం వచ్చిందని ఏఎస్పీ ఖాదర్ భాషా తెలిపారు. శరీరంపైన తీవ్ర గాయాలున్నాయి. మెడ కోసి చంపి అక్కడ వదిలేసి వెళ్లినట్లు చుట్టుప్రక్కల వారి ద్వారా విషయం తెలుసుకొన్న ఆనంది గురువు అయిన ధనాల మందాకిని, ఆలమూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఆలమూరు ఎస్సై శివ ప్రసాద్ కేసు నమోదుచేశారు. డా. బి ఆర్ . అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్ ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ పర్యవేక్షణ లో, రావులపాలెం సీఐ ఎన్. రజని కుమార్ దర్యాప్తు చేపట్టారని భాషా వివరించారు. దర్యాప్తులో భాగంగా టెక్నాలజీ ఉపయోగించి, ఆనందితో పరిచయం ఉన్న కేతా భరత్ వెంకట సుధీర్ @ పెద్ద కెతాను, అతని స్నేహితులు అయిన వీలు కళ్యాణ్ @ పెద్ద కల్లి, సింగంపల్లి కార్తికేయ @ సింభ @ సోనూ అను ముగ్గురిని విచారించి హత్య ఉదంతం వెలుగు చూసినట్లు తెలిపారు.

ప్లాన్ ప్రకారం పిలిచి హత్య...
మే నెల 12 వ తేదీ రాత్రి కేతా భరత్ వెంకట సుధీర్, స్నేహితులు సింగంపల్లి, సోనూ కలిసి ఆనంది(హిజ్రా) ని వాళ్ళ మోటార్ సైకిల్ పై వేమగిరి సెంటర్ లో ఎక్కించుకొని, తర్వాత మద్యం కొనుక్కొని జొన్నాడ శివారు పంటకాలువ వద్దకు తీసుకువెళ్లారు. బాగా మద్యం సేవిస్తుండగా ఇంతలో పెద్ద కేత మరొక స్నేహితుడు అయిన వీలు కళ్యాణ్ (కళ్లి )ఫోన్ చేయగా తనని కూడా అక్కడకు రప్పించారు. పెద్ద కల్లీ కూడా మద్యం తాగిన తర్వాత మృతురాలు ఆనంది(హిజ్రా), పెద్ద కేతా గురించి తప్పుడు గా ప్రచారం చేస్తుందనే కోపంతో ముందుగా కేతా భరత్ తన వద్ద ఉన్న బటన్ నైఫ్ తో ఆనంది మీద దాడి చేశాడు. సోనూ కాళ్ళు గట్టిగా పట్టుకోగా, పెద్దకేతా వద్ద ఉన్న బటన్ నైఫ్ ని కల్లీ లాక్కొని మెడ వెనుక వైపు పొడిచాడు. సోనూ బీర్ బాటిల్ తో తల మీద కొట్టడంతో ఆనంది చనిపోయిందని ఏఎస్పీ తెలిపారు. ముగ్గురూ ఆనందిని పక్కనే ఉన్న పంట బొదే లోనికి నెట్టివేశారు. అప్పటికి ఆనంది (హిజ్ర) కొన ఊపిరితో ఉండటంతో అది గమనించిన కల్లీ ఇది (ఆనంది) బతికుంటే తమ పేరు చెబుతుందని దిగి ఆమెపై విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో చనిపోయిందని నిర్దారించుకుని అక్కడ నుండి పరారయ్యారు.
తప్పుగా ప్రచారం చేస్తుందనే హత్య...
నిందితులు, మృతురాలు (హిజ్రా) అందరూ కలిసి మెలిసి ఉండేవారు. ప్రధాన నిందితుడు కేతా భరత్ వెంకట సుధీర్ అలియాస్ పెద్దకెతా తో ఆనంది( హిజ్రా) తో వచ్చిన విభేదాలు హత్యకు దారితీశాయి. ఆనంది పెద్ద కేతా గురించి పలు చోట్ల గేలి చేస్తూ మాట్లాడడం, చులకనగా మాట్లాడడంతో రగిలి పోయిన ప్రధాన నిందితుడు తన స్నేహితుల సహాయంతో అంత మొదించి నట్లు విచారణ లో వెల్లడైందని ఏ ఎస్పీ వెల్లడించారు. నిందితులు ముగ్గురూ ఇచ్చిన వాంగ్మూలం తో వారిని అరెస్టు చేసి వారి వద్ద నుండి హత్య చేయడానికి ఉపయోగించిన బటన్ నైఫ్, ఎనిమిది వందల రూపాయల నగదు, సుజుకీ బైక్, ఒక సీడీ డీలక్స్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్లో కేతా పై గతంలో హత్య కేసు ఉందని పోలీసులు తెలిపారు.