Kolkata Doctor Murder Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఇప్పటికే ఈ కేసుని CBI కి బదిలీ చేసింది హైకోర్టు. బెంగాల్‌లోని శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. బాధితురాలి పోస్ట్‌మార్టం రిపోర్ట్ బయటకు వచ్చాక ఆందోళనలు మరింత పెరిగాయి. అత్యంత దారుణంగా హింసించి అత్యాచారం చేసి చంపాడు నిందితుడు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే...ఇటీవల బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన వివరాలు సంచలనమవుతున్నాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని సమాచారం అందించారు. ఎంతో ఆవేదనతో హాస్పిటల్‌కి వెళ్తే దాదాపు మూడు గంటల పాటు కూర్చోబెట్టారు. ఆ తరవాత కానీ డెడ్‌బాడీని చూపించలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు.
"నాకు ఫోల్ కాల్ వచ్చింది. వాళ్లు చెప్పే దాన్ని బట్టే నా కూతురుకి ఏదో జరిగి ఉంటుందని అర్థమైంది. నా భార్య ఏడవడం మొదలు పెట్టింది. నా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని హాస్పిటల్ వాళ్లు చెప్పారు. ఇప్పుడు మమ్మల్ని కలవడానికి చాలా మంది వస్తున్నారు. వాళ్లందరినీ ఒకటే అడుగుతున్నా. మాకు న్యాయం చేయండి. నా కూతురు ఎలాగో తిరిగి రాదు. కనీసం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం"
- బాధితురాలి తండ్రి
హాస్పిటల్ ఆవరణలోనే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తల్లిదండ్రులకు చెప్పారు వైద్యులు. అప్పటి నుంచి వాళ్లు షాక్‌లోనే ఉన్నారు. బాధితురాలి తల్లి ఇంకా ఈ విషయం నమ్మలేకపోతోంది. కూతురి ముఖం చూపించాలని అక్కడి అధికారులను వేడుకుంది. అయినా మూడు గంటల పాటు అక్కడే కూర్చోబెట్టారు. ఆ తరవాత చూపించారు. (Also Read: Viral News: క్లాస్‌రూమ్‌లో బాలికపై అత్యాచారయత్నం చేసి టీచర్, కేకలు వేయడంతో పరారీ)
"దాదాపు మూడు గంటల తరవాత బాధితురాలి తండ్రి లోపలికి వెళ్లాడు. డెడ్‌బాడీని ఫొటో తీసుకుని బయటకు వచ్చి మాకు చూపించాడు. ఆమె ఒంటిపైన నూలుపోగు కూడా లేదు. తనను దారుణంగా హింసించారని శరీర భాగాలు చూస్తేనే అర్థమవుతోంది. కళ్లద్దాలు పగిలిపోయాయి. వాటి ముక్కలు కళ్లలో ఇరుక్కుపోయాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోనూ ఇదంతా ఉంది"
- బాధితురాలి బంధువు
మొత్తం నాలుగు పేజీల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. అత్యంత దారుణంగా హింసించి చంపినట్టు తేలింది. పొట్ట, వేళ్లతో పాటు ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కళ్ల నుంచి తీవ్రంగా రక్తస్రావమైంది. ప్రైవేట్ పార్ట్స్‌లోనూ రక్తస్రావమైనట్టు రిపోర్ట్ వెల్లడించింది. జననాంగానికీ గాయమైంది.
Also Read: Kolkata News: కోల్‌కత్తా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం! పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయం