Khammam Drugs : ఖమ్మం జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద ఎక్సైజ్ పోలీసులు పక్క సమాచారంతో డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తు్న్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకులు ఖమ్మం సారథి నగర్ కు చెందిన భాను తేజ, పల్లె గూడెంకు చెందిన రోహిత్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి సుమారు 1600 గ్రాముల గంజాయి , 10 గ్రాముల MDMA, 10 గ్రాముల లిక్విడ్ గంజాయితో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బెంగుళూరు హైదరాబాద్ లలో పలు కేసులు ఉన్నాయని ఎక్సైజ్ సూపరిండెంట్ నాగేందర్ రెడ్డి తెలిపారు. ఇలా డ్రగ్స్ పట్టుబడటం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇది మొట్టమొదటి కేసు అన్నారు. నిందితులు విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ ప్రాంతాలకు కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మత్తుపదార్ధాలను రూ.2 వేలకు కొనుగోలు చేసి, దాదాపు రూ. 7 వేల వరకు అమ్ముతున్నారని అని ఎక్సైజ్ సూపరిండెంట్ నాగేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, బెంగుళూరులో డ్రగ్స్ సరఫరాపై కఠినంగా వ్యవహరించడంతో కార్యకలాపాలను ఖమ్మం జిల్లాకు షిఫ్ట్ చేశారని తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవటంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పోలీసు సిబ్బందిని ఎక్సైజ్ సూపరిండెంట్ అభినందించారు.
ఆరు నెలలుగా ఖమ్మంలో మకాం
Also Read : Minister Gangula PRO Crime : స్టేషన్ బెయిల్ ఇప్పిస్తే రూ. లక్ష - అడ్డంగా దొరికిన మంత్రి కమలాకర్ పీఆర్వో !