Karnataka doctor murder case Update:  బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేస్తున్న డెర్మటాలజిస్ట్ డాక్టర్ కృతికా రెడ్డిని ప్లాన్డ్ గా చంపిన   భర్త, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి విషయంలో పోలీసు దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 24న జరిగిన ఈ హత్య తర్వాత వారం వారాల పాటు మహేంద్ర రెడ్డి,  నలుగురు, ఐదుగురు  మహిళలకు "నా భార్యను నీ కోసం చంపాను" అనే  సందేశాలు పంపాడు. వీటిని వాట్సాప్ లో కాకంా..  డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా పంపాడు. 

Continues below advertisement

డాక్టర్ మహేంద్ర రెడ్డి , డాక్టర్ కృతికా ఎం. రెడ్డి ఇద్దరూ బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. వీరు 2024 మే 26న వివాహం చేసుకున్నారు. 2025 ఏప్రిల్ 21న, కృతికా మార్తళ్లిలోని  తన తండ్రి ఇంట్లో ఉండగా  అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మహేంద్ర ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు, కానీ ఆమె మరణించింది. మొదట ఇది సహజ మరణంగా భావించారు.  కృతికా సోదరి డాక్టర్ నిఖితా రెడ్డి ఆమె కుటుంబం పోస్ట్‌మార్టం చేయాలని డిమాండ్ చేసింది. మహేంద్ర మొదట దానికి వ్యతిరేకించి.. తన భార్యను కోయడం తనకు నచ్చదని నాటకమాడాడు. కానీ పోస్టుమార్టం ఆపలేకపోయాడు.  

పోస్ట్‌మార్టం రిపోర్టులో అసాధారణ విషయాలు బయటపడ్డాయి.   ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) పరీక్షల్లో కృతికా శరీరంలో ఆపరేషన్ థియేటర్‌లో మాత్రమే ఉపయోగించే ఎనస్తీషియా డ్రగ్ ప్రొపోఫాల్ (Propofol) అధిక మోతాదులో ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇది ఆమె మరణానికి కారణమని పోలీసులు అనుమానించారు. మహేంద్ర తన మెడికల్ జ్ఞానాన్ని ఉపయోగించి ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసి..సహజ మరణంగా చూపించాడని దర్యాప్తులో తేలింది. హత్య తర్వాత మహేంద్ర తన భార్య మరణాన్ని 'లవ్ ప్రూఫ్'గా మార్చి, 4-5 మంది మహిళలను సంప్రదించాడు. ఈ మహిళల్లో కొందరు మెడికల్ ప్రొఫెషనల్స్. వీరిలో ఒకరు మహేంద్ర ముందు ప్రపోజల్‌ను తిరస్కరించిన మహిళ. పోలీసుల ప్రకారం, ఆమె అతన్ని మెసేజింగ్ యాప్‌లలో బ్లాక్ చేసిన తర్వాత, మహేంద్ర PhonePe వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా చిన్న మొత్తాలు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ట్రాన్సాక్షన్ నోట్స్‌లో "I killed my wife for you"   అని రాశాడు.  

Continues below advertisement

ఒక మహిళకు అతను తన మరణం కార్ అక్సిడెంట్‌లో ఫేక్ చేసి తిరిగి వచ్చానని కూడా చెప్పాడు. పోలీసులు మహేంద్ర మొబైల్ ఫోన్ మ, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని FSLకు పంపారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఈ సందేశాలు, డిజిటల్ ట్రయిల్‌ను నిర్ధారించారు  మహేంద్ర సోషల్ మీడియా,  మెసేజింగ్ యాప్‌ల ద్వారా అనేక మహిళలతో ఆన్‌లైన్ రిలేషన్‌షిప్‌లు కొనసాగిస్తున్నట్లుగా గుర్తించారు.  అక్టోబర్ 15న ఉడుపి జిల్లా మణిపాల్‌లో మహేంద్రను అరెస్ట్ చేశారు.