Vijay Sethupathi's Son Surya Phoenix Trailer Out : కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య 'ఫీనిక్స్' అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. జులై 4న తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తెలుగులోనూ రానుండగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ట్రెండింగ్‌లో ట్రైలర్
జువైనల్ హోంలో బాల నేరస్థులు, స్పోర్ట్స్‌లో ఉన్నత స్థానంలో ఎదగాలనే కొందరు యువకుల స్టోరీని 'ఫీనిక్స్'లో అద్భుతంగా చూపించినట్లు తెలుస్తోంది. 'మన దేశంలో లక్షలాది మంది పిల్లలు జువైనల్ జైలులో ఉన్నారు. అలా ఎందుకు అని మీరెప్పుడైనా ఆలోచించారా?' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్... జువైనల్ హోంలో జరిగే పరిణామాలు... క్రైమ్, యాక్షన్ అన్నీ అంశాలు కలిపి ఆసక్తికరంగా ఉంది. ఓ టీనేజర్ ఆవేశంలో ఓ ఎమ్మెల్యేను హత్య చేస్తాడు.
ఈ క్రమంలో జువైనల్ హోంకు వెళ్లిన అతన్ని చంపాలని ఆ ఎమ్మెల్యే భార్య కుట్రలు పన్నుతుంది. అయితే, బాక్సర్‌గా ఎదగాలనుకున్న ఆ యువకుడు అసలు ఎమ్మెల్యేను ఎందుకు చంపాల్సి వచ్చింది? అతని ప్లాష్ బ్యాక్ ఏంటి? ఆ జువైనల్ హోంలో జరిగిన పరిణామాలేంటి? ఓ బాక్సర్‌గా ఈ యువకుడు ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ది రాజా సాబ్' రిలీజ్ రూమర్లకు చెక్... ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
ఈ మూవీకి ఫేమస్ ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించగా... అబి నక్షత్ర, వర్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటే వరలక్ష్మి శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు పోషించారు. బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండగా... సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. సూర్య ఈ మూవీతోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. తనదైన యాక్షన్, స్టైల్‌తో అదరగొట్టారు. ఈ నెల 7న మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.