దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ కైస్త్రవ సన్యాసిని (నన్) అత్యాచార కేసులో కొట్టాంయం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను నిర్దోషిగా కోర్టు తేల్చింది.







అత్యాచారం కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు అభిప్రాయ పడింది.  జస్టిస్ జీ. గోపకుమార్ ఈ కేసులో సింగిల్ లైన్ తీర్పునిస్తూ ఫ్రాంకోపై మోపిన అభియోగాలన్నింటి నుంచి ఊరట కల్పిస్తున్నట్లు పేర్కోన్నారు. దాదాపు 100 రోజుల పాటు జరిగిని విచారణ అనంతరం ములక్కల్ నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. 


ఇదే కేసు..


జలంధర్ డయోసిస్‌లో ములక్కల్ బిషప్‌గా పని చేశారు. 2014 నుంచి 2016 వరకు కురవిలంగాడ్‌లోని మిషనరీస్ ఆఫ్ జీసస్ కాన్వెంట్‌లో పనిచేసిన సమయంలో తనపై 13 సార్లు బిషప్ ములక్కల్ అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2018లో కొట్టాయం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2018 అక్టోబర్‌లో బిషప్‌ను అరెస్ట్ చేసి అక్రమ నిర్భంధం, అత్యాచారం, నేర ప్రవృత్తి కింద కేసులు నమోదు చేసి కోర్టులో 2000 పేజీల చార్జి షీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో 2018‌ అక్టోబర్ 15న  బిషప్ ములక్కల్‌కు బెయిల్‌ వచ్చింది. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. దాదాపు 40 మందిని కోర్టులో సాక్షులుగా ప్రవేశపెట్టారు. ఒక్కరు కూడా సరైన ఆధారాలను కోర్టుకు సమర్పించలేకపోయారు. జనవరి 10 విచారణ ముగిసింది. దీంతో కోర్టు ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టి వేసి నిర్దోషిగా ప్రకటించింది.


Also Read: China Zero Covid Strategy: అక్కడ అంతే.. ఎదిరిస్తే జైల్లోకి.. అనుమానమొస్తే బోనులోకి!


Also Read: Bikaner Guwahati Accident: ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి