Karimnagar Crime News: వివాహేతర సంబంధాల మోజులో (Extra Marital Affair) పడి కొంత మంది వావి వరసలను పట్టించుకోవడం లేదు. కనీసం తమకు పుట్టిన పిల్లల భవిష్యత్తుపై కూడా ఏ మాత్రం బెంగ లేకుండా, నచ్చిన వారితో వెళ్లిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటన తాజాగా ఇంకోటి జరిగింది. కానీ, ఈ కేసులో వావివరసలు మర్చిపోయి శారీరక సుఖమే ముఖ్యంగా వెళ్లిపోవడం కాకుండా మరో దారుణమైన విషయం కూడా ఉంది. నమ్మి వెళ్లిన మహిళను ఆమె ప్రియుడు హతమార్చాడు. ఆ ప్రియుడు స్వయంగా ఆమె భర్తకు సోదరుడు కావడం ఇందులో మరింత దిగ్భ్రాంతి కలిగించే విషయం. కరీంనగర్ జిల్లా (Karimnagar District News) లో ఈ ఘటన జరిగింది.


పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ మహిళ భర్త, పిల్లలను వదిలేసి.. భర్త అన్నతో వెళ్లిపోయింది. భర్త సోదరుడితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) కొన్నాళ్లుగా సాగిస్తోంది. చివరికి సహజీవనం (Live in Relationship) చేస్తున్న ఆ బావే (Husband's Elder Brother) మరదలిని చంపేశాడు. ఈ ఘటన కరీంనగర్‌ (Karimnagar) పరిధిలోని అల్గునూర్‌లో (Alugunur) మంగళవారం జరిగింది. లోవర్ మానేర్ డ్యాం పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. 


మధ్యప్రదేశ్‌కు (Madhya Pradesh) చెందిన రామ్‌కాలి అనే 25 ఏళ్ల మహిళకు భోజరాజు అనే వ్యక్తితో ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం రామ్‌ కలి, భోజరాజు అన్న శ్యామ్‌తో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకుంది. శ్యామ్‌కు పెళ్లి అవ్వకపోవడంతో రామ్‌కలి.. తన భర్త, పిల్లలను వదిలేసి 15 రోజుల క్రితం కరీంనగర్‌ కార్పొరేషన్‌ (Karimnagar Corporation) పరిధిలోని అల్గునూర్‌కు ఇద్దరూ వచ్చారు. ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో సహజీవనం (Live in Relationship) చేస్తున్నారు. అలా ఉంటూనే వీరు కూలి పని చేసుకుంటున్నారు. కరీంనగర్ లోనే ఓ వ్యాపారి వద్ద ఇద్దరూ మేస్త్రీ, కూలీగా పని చేస్తున్నారు.


ఉదయం నుంచి బాగా పని చేసిన వారు మంగళవారం (నవంబరు 2) సాయంత్రం పని ముగించుకొని రామ్‌ కలి, శ్యామ్‌ ఫూటుగా మద్యం తాగారు. ఈ సందర్భంగా రామ్‌ కలి శ్యామ్‌తో గొడవ పెట్టుకుంది. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయిన బావ శ్యామ్ పక్కనే ఉన్న కర్రతో ఆమెను గట్టిగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడి ఆమె అక్కడికక్కడే మరణించింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు (Karimnagar Police) సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హత్యకు పాల్పడిన నిందితుడితో మాట్లాడి కారణాలు అడిగి తెలుసుకున్నారు. తానే ఆమెను చంపినట్లుగా అంగీకరించాడు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి (Karimnagar Government Hospital) తరలించామని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.