Karimnagar News :  కరీంనగర్ లో భూ వివాదాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు కొత్తగా వచ్చిన సీపీ అభిషేక్ మహంతి. సమస్యల పరిశీలనకు సిట్ ను నియమించారు. ఇందులో భాగంగా నగరంలోని భూ వివాదాల్లో తలదూర్చుతున్న ఓ కార్పోరేటర్ తోపాటు, టీఆర్ఎస్ నేతను, మరో వ్యక్తిని ఇవాళ కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చశారు. రేకుర్తి, సీతారాంపూర్ కు చెందిన మరో ఇద్దరు ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 


 కరీంనగర్  భగత్ నగర్ కి చెందిన కొత్త రాజిరెడ్డి, తండ్రి భాగిరెడ్డి వయసు 63, అతను మున్సిపల్ పర్మిషన్ ద్వారా ఇంటి నిర్మాణము చేస్తుండగా హైదరాబాద్ నల్లకుంట , ప్రస్తుత నివాసం గంగాధర కు చెందిన చీటీ రామారావు మరియు కరీంనగర్ 12వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ తోట రాములు కలిసి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నారని కొత్త రాజి రెడ్డి గత నెల 20 వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ ఎస్సై ఎస్.ఐ. స్వామి కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో పై ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా రాజి రెడ్డి ఇంటి స్థలాన్ని ఆక్రమించుకోవాలనే  దురుద్దేశంతో  హద్దులు మార్చి   తప్పుడు దృవపత్రాలు సృష్టించారని విచారణలో తేలింది.          


ఈ విచారణ కరీంనగర్ కమీషనరేట్ లో నూతనంగా ఏర్పాటైన  ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సహాయంతో వన్ టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు.  దానిలో భాగంగా పూర్తిస్థాయి విచారణకై పోలీసు బృందం హైదరాబాద్, విశాఖపట్నం  సైతం వెళ్లి  కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించామని తెలిపారు. ఇప్పటివరకు సేకరించినటువంటి ఆధారాల మేరకు పై వ్యక్తులు అక్రమంగా భూకబ్జాకు పాల్పడ్డారని  నిర్ధారించిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జె.సరిలాల్ పై వ్యక్తులను (Cr. No. 491/2023 u/s 120-B , 447, 427, 465, 467, 468, 471 r/w 34 IPC) అరెస్ట్ చేసి కరీంనగర్ మెజిస్ట్రేట్ కోర్ట్ లో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ కేసుపూర్వ పరాలు పరశీలించి నిందితులను ఈ నెల 31 వ తేది వరకు రిమాండ్ విధించారు. కేసుపై విచారణ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు.


చీటీ రామారావుతో పాటు  బీఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్ తోట రాములు, నిమ్మశెట్టి శ్యాం అనే ముగ్గురిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీ ఇంతకాలం అధికార బలంతో తనను ఇబ్బందుల పాలు చేసారంటూ.. హైదరాబాద్ లో ప్రజాపాలనకు హాజరై సీఎం రేవంతర్ రెడ్డికి  ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి పోలీసులకు వచ్చిన ఆదేశాలతో విచారణ జరపిన సిట్ బృందం చర్యలు తీసుకుంది.  చీటీ రామారావుపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. తాను కేసీఆర్ కు బంధువునంటూ ఆయన భూ వివాదాల్లో తలదూర్చి అందినకాడికి దండుకుంటారని అంటున్నారు.