Jewish Woman Killed: 


దారుణ హత్య..


డెట్రాయిట్‌లో యూదు వర్గానికి చెందిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని కత్తితో పొడిచి చంపారు. ఆమె ఇంటి బయటే ఈ దారుణం జరిగింది. డెమొక్రటిక్ నేతలకు అడ్వైజర్‌గా పని చేస్తున్నారు సమంత వాల్ ( Samantha Woll). ఆమె వయసు 40 ఏళ్లు. డెట్రాయిట్‌లోని Joliet Place వద్ద ఆమె ఇంటికి దగ్గర్లోనే మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. రక్తపు మడుగులో ఉన్న డెడ్‌బాడీని చూసి షాక్ అయ్యారు. ఇప్పటి వరకూ ఈ హత్యకు కారణమేంటన్నది గుర్తించలేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇప్పటికైతే పూర్తి సమాచారం లేదని, తెలిసిన వెంటనే మీడియాకి వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 


"ఈ హత్య ఎందుకు చేశారు..? ఎవరు చేశారు.? అనేది ఇంకా క్లారిటీగా చెప్పలేకపోతున్నాం. విచారణ జరిగితే కానీ స్పష్టత రాదు. ఈ కేసు చుట్టూ ఎన్నో చిక్కు ప్రశ్నలున్నాయి. క్లారిటీ వచ్చేలోగా ఎవరూ తప్పుడు ప్రచారాలు చేయొద్దు. దర్యాప్తు కొనసాగుతోంది"


- పోలీసులు 






సమంతా హత్యపై స్థానికులు ఆందోళనకు గురయ్యారు. హత్యకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని, ఉన్నట్టుండి ఇలా రోడ్డుపై ఆమె మృతదేహం కనిపించడం షాక్‌కి గురి చేసిందని అన్నారు. ఈ హత్య తరవాత స్థానికుల్లోని జూదుల్లో భయం మొదలైంది. 


చైనాలోనూ ఘటన..


చైనాలో ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై దాడి జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఉన్నట్టుండి వచ్చి కత్తితో పొడిచాడు. ఇజ్రాయేల్ విదేశాంగ శాఖ ఈ విషయం వెల్లడించింది. ప్రస్తుతానికి బాధితుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. ఇప్పటికే ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఇజ్రాయేల్ దౌత్యవేత్తపై దాడి జరగడం సంచలనమైంది. ఇప్పటికే ప్రపంచదేశాల్లో ఉన్న ఇజ్రాయేల్ పౌరులను, జూదులను అప్రమత్తం చేశారు. దాడులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు. ఇప్పుడు ఇజ్రాయేల్‌ దౌత్యవేత్తపై జరిగిన దాడిని టెర్రర్ అటాక్‌గానే భావిస్తున్నారు. ఈ ఘటన తరవాత ఇజ్రాయేల్, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బీజింగ్‌లోని ఇజ్రాయేల్‌ దౌత్య కార్యాలయం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హమాస్ దాడులను ఖండించకపోగా..ఇలా దాడులు జరుగుతున్నా చైనా పట్టించుకోవడం లేదని మండి పడుతోంది. డ్రాగన్ చాలా ఉదాసీనంగా వ్యవహరించడంపై ఇప్పటికే ఇజ్రాయేల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల యుద్ధంలో 1,200 మంది ఇజ్రాయేల్ పౌరులు, 1,530 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. వందలాది మంది ఊరొదిలి వెళ్లిపోయారు. గాజాపై మరింత ఉద్ధృతంగా దాడులు చేసేందుకు ఇజ్రాయేల్‌ సిద్ధమవుతోంది. 


Also Read: గాజాకి భారత్ భారీ సాయం, స్పెషల్ ఫ్లైట్‌లో టన్నుల కొద్ది మెడిసిన్స్‌