Srikakulam Crime News: ఓ యువకుడు మరణం శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది. తొలుత ఆత్మహత్య అని భావించినా చాటింగ్‌, ఇతర ఫొటోలు వీడియోలు చూసిన కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌స్టాలో పరిచయమైన మహిళ కారణంగానే హత్య చేసి ఉండొచ్చని అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులు ఫిర్యాదులో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయో అన్న ఆసక్తి ఆ ప్రాంతంలో ఏర్పడింది. 


యువకుడి ఆత్మహత్యపై అనుమానం


శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం వాసి రమేష్ అనే యువకుడు జులై 27న మరణించాడు. ఓ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న రమేష్‌ సీతంవలస సమీపంలోని తోటలో ఉరి వేసుకుని కనిపించాడు. రోజూ మాదిరిగానే డ్యూటీకి వెళ్లిన కొడుకు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని చెప్పగానే ఫ్యామిలీ మెంబర్స్ షాక్ అయ్యారు. తర్వాత రోజు పోస్టుమార్టం చేసి అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. హ్యాపీగా నవ్వుతూ తిరిగే కుమారుడు ఆత్మహత్య చేసుకోవడమేంటని ఆలోచించిన తల్లిదండ్రులు ఆరా తీశారు. 


ఆరా తీస్తే గుట్టు చెప్పిన స్నేహితులు


స్నేహితులతో మాట్లాడి అసలేం జరిగిందని విచారణ చేస్తే రమేష్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడూ ఇన్‌స్టాలో ఉండే రమేష్‌కి లావేరు మండలానికి చెందిన ఓ వివాహితతో పరిచడమేర్పడిందని తేలింది. వీళ్లిద్దరి చాటింగ్ విషయం భర్తకి తెయిడంతో గొవడ జరిగినట్టు చెబుతున్నారు. జులై 27న రమేష్‌, వివాహితకు కామన్‌ ఫ్రెండ్‌గా ఉన్న గోపీ, ప్రసాద్‌ ఆసుపత్రికి వచ్చారని తెలిసింది. మాట్లాడాలని చెప్పి రమేష్‌ను లావేరు మండలం తీసుకెళ్లినట్టు గుర్తించారు. అక్కడే తమ బిడ్డను కొట్టి చంపేశి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై తీసుకొచ్చి సీతంవలసలో ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. 


Also Read: కోనసీమలో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనల్లో ప్రజలు


జిల్లా ఎస్పీకి ఫిర్యాదు


ఈ విషయాలను అన్నింటినీ వివరిస్తూ జిల్లా ఎస్పీకి మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని కేసు పునర్విచారణ చేయాలని పేర్కొన్నారు. ఎస్పీ సూచనల మేరకు బాధిత కుటుంబ సభ్యులు శ్రీకాకుళం డిఎస్పీ వివేకానందను కలిసి సమాచారాన్ని అందజేశారు. వివాహిత ఊర్లో జరిగిన గొడవ విషయాన్ని విశాఖలో ఉంటున్న రమేష్ సోదరుడు నరేష్‌కి గోపి అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


రమేష్‌ది హత్యగా ఫ్యామిలీ అనుమానం 


రమేష్‌ది ఆత్మహత్య కాదని హత్యేనని బలంగా నమ్ముతున్నారు ఫ్యామిలీ మెంబర్స్. అందుకే కేసుపునర్విచారణ చేయాలని ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. వివాహిత భర్తతోపాటు ఆతడి స్నేహితులు పలువురు పెద్ద మనుషుల పేర్లను సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు. సిసి కెమెరా వీడియోలను కుటుంబ సభ్యులు సేకరించి పోలీసులకి అందజేసారు.  వివాహితతో చాటింగే యువకుడి ప్రాణాల మీదకి తెచ్చిందని స్థానికులు అనుమానిస్తున్నారు. 


Also Read: బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగల ముఠా అరెస్ట్