13 year old Palghar boy kills child:  సినిమాలు, ఓటీటీలు చిన్న పిల్లలపై ఎంత ఘోరమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నదానికి ఉదాహరణ ఈ ఘటన . కుటుంబంలో ఉన్న వారంతా ఓ ఐదేళ్ల పిల్లపై ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నానని తనను పట్టించుకోవడం లేదని ఫీలై.. ఆ పాపను తీసుకెళ్లి ఘోరంగా కొట్టి చంపేశాడు. ఈ హత్యా ఘటన సంచలనం సృష్టిస్తోంది.                   

మహారాష్ట్రలోని పాల్గార్ అన ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఆ కుటుంబం కాస్త పెద్దది. ఉమ్మడి కుటుంబంలా ఉంటారు. ఆ కుటుంబంలో ఓ ఐదేళ్ల బాలిక హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆ బాలికను ఆ కుటుంబంలో చిన్నది కావడంతో అందరూ గారాబంగా చూసుకుంటారు. ఎవరూ తీసుకెళ్లి ఆడించడం లాంటివి చేయకపోవడంతో ఎక్కడికి వెళ్లిందో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు కూడా ఆ అంశం మిస్టరీగానే అనిపించింది. అయితే సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలను జల్లెడ పట్టినప్పుడు  ఓ ఆ చిన్నపిల్లను మరో పిల్లవాడు తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు. ఆ సీసీ ఫుటేజీని చూసిన కుటుంబసభ్యులకు.. ఆ పిల్లవాడు తమ బిడ్డే అని గుర్తించారు. 

అయితే ఆ పదమడేళ్ల పిల్లవాడు మాత్రం..తాను ఆ పాపను తీసుకెళ్లలేదని బుకాయించాడు. చివరికి పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో నిజం చెప్పాడు. తాను ఆ పాపను తీసుకెళ్లి రాయితో కొట్టి చంపేశానని చెప్పాడు. అ ప్రాంతానికి పోలీసులను తీసుకెళ్లి చూపించాడు. అక్కడ విగతజీవిగా పడి ఉన్న పాపను చూసి ఆ కుటుంబం తల్లఢిల్లీ పోయింది.                                     

ఆ పాపను ఆ బాలుడు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఎందుకు చంపాడు.. ఎలా చంపాడని పోలీసులు ఆరా తీశారు. అయితే ఆ పాప పుట్టక ముందు ఆ కుటుంబం మొత్తం ఆ కుర్రవాడ్ని అల్లారు ముద్దుగా చూసుకునేది. పాప పుట్టిన తర్వాత అందరూ ఆ పాప గురించే ఆలోచించడం ప్రారంభించారు. పాప  ఉండటం వల్లే తనను ఎవరూ పట్టించుకోవడం లేదని .. ఆ పాపను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఇందు కోసం అతను ఓ ఓటీటీలో రామన్ రాఘవ్ అనే సినిమా చూసినప్పుడు రాళ్లతో కొట్టి చంపవచ్చని తెలుసుకున్నాడు. రామన్ రాఘవ్ అనేది ఓ సీరియల్ కిల్లర్ స్టోరీ. దాన్ని చూసి ఇన్ స్పయిర్ అయిన యువకుడు... ఆ పాపను అలాగే తీసుకెళ్లి చంపేశాడు. 

ఈ ఘటనతో ఆ కుటుంబంతో తమ కంటిపాపలను కోల్పోయింది. ఒకరు చనిపోతే.. మరొకరు జైలుపాలయ్యారు. ఓటీటీల వల్ల ఇలాంటి ఘోరమైన సైడ్ ఎఫెక్టులు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.                   

Also Read: రాహుల్​ను హత్య చేయించింది పెద్దిరెడ్డి, మిథున్​ రెడ్డే- కోగంటి, విజయ్​కుమార్​ ఆరోపణలు