Indian Student Dead in US: అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి మృతి చెందడం స్థానికలకం కలకలం సృష్టించింది. ఇండియానాలోని Purdue University లో చదువుతున్న 23 ఏళ్ల సమీర్ కామత్ (Sameer Kamath) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఇదే యూనివర్సిటీకి చెందిన భారత సంతతికి చెందిన విద్యార్థి ఇలా మృతి చెందడం రెండోసారి. ఈ ఏడాదిలో అమెరికాలో మొత్తం నలుగురు విద్యార్థులు ఇలానే ప్రాణాలు కోల్పోయారు. అనుమానాస్పద స్థితిలో సమీర్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. ఓ పార్క్‌లో డెడ్‌బాడీని గుర్తించారు. గతేడాది ఆగస్టులో  Purdue Universityలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు సమీర్. ఆ తరవాత అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాడు. 2025లో PHD పూర్తవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ అటాప్సీకి పంపారు. త్వరలోనే ఈ రిపోర్ట్‌ విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇటీవలే ఇదే యూనివర్సిటీలో చదువుతున్న నీల్ ఆచార్య కూడా ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయాడు. క్యాంపస్ గ్రౌండ్‌లో మృతదేహాన్ని గుర్తించారు. తల్లి మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాక పోలీసులు గాలింపులు చేపట్టారు. చివరకు క్యాంపస్‌లోనే గ్రౌండ్‌లో డెడ్‌బాడీని కనుగొన్నారు. అంతకు ముందు నీల్ ఆచార్య తల్లి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఊబర్ డ్రైవర్‌ నీల్‌ని క్యాంపస్‌ దగ్గర డ్రాప్ చేసి వెళ్లాడని, ఆ తరవాత నుంచి కనిపించకుండా పోయాడని తెలిపింది. ఈ పోస్ట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అంతకు ముందు వారం ఓహియో ప్రాంతంలో భారత సంతతికి చెందిన 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి ఇదే విధంగా మృతి చెందాడు. 


అమెరికాలోని ఓ జిమ్‌లో గతేడాది భారతీయ యువకుడిపై దాడి జరిగింది. ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో తలపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. గతేడాది అక్టోబర్ 29న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే ప్రాణాలతో పోరాడుతున్న బాధితుడు చివరకు మృతి చెందాడు. వాల్పరైసో యూనివర్శిటీలో (Valparaiso University) కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వరుణ్ రాజ్‌పై ( Varun Raj Pucha) జార్డన్ (Jordan Andrade) అనే వ్యక్తి  దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగుతోంది. అయినా ఫలితం లేకుండా పోయింది. వరుణ్ రాజ్ చనిపోయినట్టు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. వరుణ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. ఈ దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై దాడి చేస్తాడేమో అన్న భయంతోనే అలా చేశానని నిందితుడు పోలీసులకు వివరించాడు. కానీ సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగిందన్నది ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. అయితే జిమ్‌ నిర్వాహకులు మాత్రం వరుణ్ రాజ్‌ చాలా సైలెంట్‌గా ఉంటాడని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని చెబుతున్నారు. 


"వరుణ్ రాజ్ చనిపోయాడని చెప్పడానికి చాలా విచారిస్తున్నాం. మా యూనివర్సిటీ మంచి విద్యార్థిని కోల్పోయింది. వరుణ్ కుటుంబానికి, మిత్రులందరికీ ప్రగాఢ సంతాపం"


- వాల్పరైసో యూనివర్సిటీ


Also Read: చికాగోలో భారతీయ విద్యార్థిపై దాడి, సాయం కోసం పరుగులు పెట్టిన బాధితుడు - వీడియో వైరల్