Youtuber Suicide : సోషల్ మీడియా ఎంట్రీతో యువత లైఫ్ స్టైల్ లో చాలా మార్పులు వచ్చాయి. రోజుకో వీడియో లేదా ఫొటో షూట్ తో సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ ఉండాలి. పోస్టు చేసిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావాలి, వేలల్లో లైక్ లు రావాలి. ఒకవేళ వ్యూస్ రాకపోతే అక్కడితో వదిలేయడంలేదు. వ్యూస్ కోసం కొందరు పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. వాటిని తలచుకుంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. మరికొందరైతే మరింత సీరియస్ గా తీసుకుని ఆత్మహత్య వరకూ వెళ్తున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వ్యూస్ రావడంలేదని
హైదరాబాద్ సైదాబాద్‌లో ఓ యూట్యూబర్ తన వీడియోలకు వ్యూస్ రావడంలేదని సూసైడ్ చేసుకున్నాడు. లైవ్‌లో గేమ్స్ ఆడుతూ యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసేవాడు విద్యార్థి డీనా. అతడు ఐఐటీ గ్వాలియర్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. యూట్యూబ్‌లో తన ఛానల్ కు వ్యూయర్స్ పెరగడంలేదంటూ ఓ వీడియోలో ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వీడియో పోస్టు చేసిన కొద్దిసేపటికే అతడు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటి క్రితం లైవ్ లో గేమ్ ఆడుతూ డీనా తన బాధను చెప్పుకున్నాడు. ఎవరూ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచన కూడా చేశాడు. లైవ్‌లో గేమ్స్ ఆడడంలో దిట్ట అయినా డీనా, యూట్యూబ్‌లో selflo గేమ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు.
మానసిక ఒత్తిడితో ఆత్మహత్య
యూ ట్యూబ్ ఛానల్ కు వ్యూస్ రావడం లేదని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రాంతి నగర్ కాలనీలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. క్రాంతి నగర్ లో ఓ అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో యూట్యూబ్ లో తన గేమింగ్ ఛానల్ కు వ్యూస్ రావడంలేదని మానసిక ఒత్తిడితో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Also Read : Kamareddy News : కామారెడ్డి జిల్లాలో దారుణం, కోడలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త