Hyderabad police have arrested a pub Cheating gang : అమ్మాయి సన్నగా నవ్విందని సరదాగా పబ్‌కి వెళ్లి మాట్లాడితే.. ఖర్చయిపోతారు. ఎంతగా అంటే.. జేబులో ఉన్న డబ్బులు.. క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ మొత్తం ఖర్చయిపోతుంది. ఈ ముఠాలు చేసే మోసాలను హైదరాబాద్ పోలీసులు వెలికి తీశారు.
హైదరాబాద్ లో మోష్ అనే పబ్ ఉంది. ఆ పబ్ నిర్వాహకులు అమ్మాయిల్ని ఎరగా వేసి..రోడ్డు మీద యువకుల్ని ట్రాప్ చేస్తున్నారు. వారు యువకుల్ని తీసుకుని పబ్ లోకి వస్తే.. కొద్ది మొత్తం డ్రింక్‌కే వేల రూపాయల బిల్లు వేసి దోచుకుంటున్నారు. తీరా విషయం తెలిసే సరికి అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు. ఈ అంశంపై ఫిర్యాదులు రావంతో మాదాపూర్ డీసీపీ వినీత్ విచారణ జరిగి గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా గ్రూపుగా ఫామ్ అయి ఈ తరహా మోసాలు చేస్తున్నారని గుర్తించారు.
ముందుగా నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ సైట్స్ లో ఫొటోస్ పెట్టి చాట్ చేస్తున్నారు. అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గర్లోని పబ్స్ కు తీసుకు వెళ్తారు . వీరికి ఆయా పబ్స్ లో సపరేట్ క్యూ ఆర్ కోడ్ మెషిన్, సపరేట్ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెనూ అమ్మాయితో వచ్చిన కస్టమర్ కి ఇస్తారు. అమ్మాయిలకు 10 ml ఆల్కహాల్ కస్టమర్ కు 30 ml సర్వ్ చేస్తారు. బిల్లింగ్ సమయానికి అమ్మాయి చీట్ చేసి పారిపోతుంది.. ఎక్కువ బిల్లు వేసి.. ఆ మొత్తాన్ని ఈ గ్రూపు, అమ్మాయి, పబ్ నిర్వాహకులు షేర్ చేసుకుంటున్నారని మాదాపూర్ డీసీపీ వినీత్బయట పెట్టారు.
ఈ గ్యాంగ్ నలభై రోజుల్లో 40 లక్షల వరకు మోసం చేశారని గుర్తించారు. ఈ గ్యాంగ్ నెల రోజుల తరువాత మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుందని.. హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ లో సైతం ఇలా చేయబోతుంటే పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో 8 మొబైల్స్, కియా కారు సీజ్ చేసామని తెలిపారు. ఈ మోసాలకు పాల్పాడే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నిందితులతో కలిసి మోసం చేసిన చెరుకుపల్లి సాయి కుమార్ అనే మోష్ పబ్ మేనేజర్ ను అరెస్టు చేసారు. పబ్ ఓనర్లపై కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్టు చేసినట్లుగా తెలిపారు.
సైబర్ మోసాలకు తోడు యువకుల బలహీనతల్ని అడ్డం పెట్టుకుని ఇలా మోసం చేసే వ్యవహారాలు పెరగడంతో పోలీసులు .. అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి మోసపోవద్దని కోరుతున్నారు.