Hyderabad Loud Sound: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉదయం 9:15 గంటల సమయంలో ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్, కేశవస్వామినగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం తీవ్రతకు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో ఎక్కడైనా బ్లాస్టింగ్ జరిగిందా? లేక భూకంపం వచ్చిందా? అని ప్రజలు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఈ భారీ శబ్దం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Also Read: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నాచారంలో ఉన్న ఒక హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న తన స్నేహితులను కలవడానికి వచ్చాడు. అనంతరం దుర్గం చెరువును చూడటానికి వెళ్లిన రాజేష్, అక్కడ కేబుల్ బ్రిడ్జి పైనుంచి ఒక్కసారిగా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజేష్ అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే రాజేష్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. రాజేష్ మృతదేహాన్ని వెలికితీసేందుకు NDRF, DRF బృందాలు దుర్గం చెరువులో గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
