Hyderabad Crime : హైదరాబాద్  జీడిమెట్ల పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. బ్యూటిషన్ పై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. స్నేహితుల ద్వారా సంజీవరెడ్డి అనే వ్యక్తి బాధితురాలితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. స్టూడియో పెట్టిస్తానని నమ్మించి బ్యూటిషన్ పై పలుమార్లు అత్యాచారం చేశాడు సంజీవరెడ్డి. బుధవారం యువతి పుట్టినరోజు కావడంతో ఇంటికి వెళ్లిన సంజీవరెడ్డి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని స్నేహితులతో చెప్పగా వారు బుధవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


యువతిని గదిలో బంధించి దారుణం 


హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఏదో ఓ చోట రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు మళ్లిన వాళ్ల వరకు ఎవర్నీ వదిలి పెట్టట్లేదు ఈ కామాంధులు. ఇలాంటి కీచకుల మధ్య నేడు ఆడపిల్ల బతకడమే కష్టంగా మారింది. భాగ్య నగరంలోని జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన మరవకముందే బంజారాహిల్స్ ప్రాంతంలో మరో అఘాయిత్యం జరిగింది. ఓ యువతిని గదిలో బంధించి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సెక్యూరిటీ గార్డు. ఈ దారుణ ఘటన ఈనెల 4వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మహిళా సర్పంచ్ పై సైతం అత్యాచారం జరగడం, ఆపై అవమానాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. 


అసలేమైందంటే?


బంజారాహిల్స్ లోని ఓ బస్తీకి చెందిన యువతికి.. అదే ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్ లో పని చేసే చిన్మయి సైక్యా అనే 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. పైకి బాగానే మాట్లాడుతున్నా.. లోపల మాత్రం ఆమెపై విపరీతమైన ఆశ కల్గింది. అది గ్రహించలేని ఆ అమ్మాయి అతడితో స్నేహంగానే ఉండేది. ఈనెల 4వ తేదీన ఏదో పని ఉందని చెబుతూ.. ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. యువతిని తన కోరిక తీర్చమని అడిగాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఇది తప్పు అని స్నేహితుడ్ని వారించేందుకు ప్రతయ్నించింది. కానీ ఆమె మాట పట్టించుకోని సెక్యూరిటీ గార్డ్.. ఆమెను గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. ఆపై ఆమె వద్దూ వద్దని ఏడుస్తున్నా వినకుండా అత్యాచారం (Security Guard Rapes Woman) చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో ఇంట్లోనే గదిలోనే ఏడుస్తూ ఉండిపోయింది. 


చనిపోతానంటూ స్నేహితురాలికి మెసేజ్ 


కుటుంబ సభ్యులు వచ్చే సరికి మామూలుగా ఉన్నట్లు నటించింది. తల్లిదండ్రులు ఏమైందని అడిగినా ఏం లేదంటూ గదలికో వెళ్లి తలుపులేస్కుంది. కానీ పదే పదే అతడు చేసిన అఘాయిత్యం గుర్తకు వచ్చి చనిపోవాలనుకుంది. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి మెసేజ్ ద్వారా తెలియ జేసింది. వెంటనే అప్రమత్తమైన ఆమె.. విషయాన్ని బాధితురాలి సోదరికి తెలిపింది. నిమిషం కూడా ఆగకుండా ఆమె చెల్లి వద్దకు పరిగెత్తుకెళ్లి ఏమైందని అడిగింది. ముందుగా ఏవేవో చెప్పిన ఆ అమ్మాయి.. ఆ తర్వాత నిజం చెప్పింది. తనను గదిలో బంధించి మరీ సెక్యూరిటీ గార్డు బలాత్కారం చేసినట్లు వివరించింది. 


Also Read : తల్లిదండ్రులపై యువతి ఫిర్యాదు- బలవంతపు పెళ్లి చేస్తున్నారని ఆవేదన


Also Read: Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు