Hero Naveen Reddy : టాలీవుడ్ సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న నవీన్ రెడ్డి .. సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టుపెట్టారని అభియోగాలు వచ్చాయి. ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అరోపణలు కూడా ఉన్నాయి. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై బాధితులు ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డి పై సెక్షన్లు 420, 465,468,471 r/w 34 IPC కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు నవీన్ ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. మోసం చేసిన డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు చేసినట్లు తెలుస్తోంది. నో బడీ అనే సినిమాలో నవీన్ రెడ్డి హీరోగా చేశారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కోడిపుంజులగూడెంకు చెందిన నవీన్ రెడ్డి పై గతంలో బైక్ దొంగతనం కేసులు సైతం ఉన్నాయి.
స్యాండిల్ వుడ్ హీరో అరెస్టు
సినిమాల్లో హీరోగా నటించిన మంజునాథ్ హైటెక్ వ్యభిచారం కేసులో అరెస్టు అయ్యాడు. వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో పొలీసులు కొంతకాలంగా నిఘా పెట్టి ఇటీవల అతడిని అరెస్టు చేశారు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని ఆరుగురి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. హైటెక్ వేశ్యవాటిక కేంద్రాల మీద పోలీసులు దాడులు చేసి నిందితులను అరెస్టు చేయగా వాళ్లలో సినిమా హీరో ఉండటం కలకలం రేపింది. వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా హైటెక్ వేశ్యవాటిక నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో బెంగళూరు సీసీబీ పొలీసులు కొంతకాలం నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేశారు. ఇలా అరెస్టు అయిన ఆరు మందిలో స్యాండిల్ వుడ్ హీరో మంజునాథ్ అలియాస్ సంజు అనే హీరో ఉండటం సంచలనం అయింది.
యూట్యూబ్ యాంకర్ తో వాగ్వాదం, హీరో అరెస్టు
మలయాళ యంగ్ హీరో శ్రీనాథ్ భాసీ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. కేరళ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓ లేడీ యాంకర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు, స్టేషన్ మెట్లు ఎక్కించారు. శ్రీనాథ్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ మహిళా యాంకర్ కేరళలోని మరడు పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్య్వూలో పాల్గొన్న హీరో శ్రీనాథ్ మధ్యలో తనను అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొంది. కోపంతో చెప్పలేని మాటలు మాట్లాడాడని వెల్లడించింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీనాథ్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ‘కప్పెలా’, ‘భీష్మ పర్వం’, ‘ట్రాన్స్’ సహా పలు సినిమాలో నటించి మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనాథ్ భాసీని. స్టార్ హీరోగా సత్తా చాటుతున్నాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ షోలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయనకు కోపం వచ్చింది. హీరో అనే విషయాన్ని మర్చిపోయి యాంకర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.