Hyderabad Fire Accident: హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్ కి ఎదురుగా ఉన్న భవనంలోని సాఫ్ట్ వేర్ ఆఫీసు ప్రాంగణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బిల్డింగ్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ప్లేస్ ను డంపింగ్ ( wastage)  కోసం వాడుతున్నారని సమాచారం. అయితే పార్కింగ్ స్థలంలో మంటలు చెలరేగడంతో అక్కడ దట్టమైన పొగ కమ్ముకుంది. అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆఫీసు నుంచి బయటకు పరుగులు తీశారు. 


సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందకు యత్నిస్తున్నారు. అయితే ఆ బిల్డింగ్ తో పాటు అందులో ఉన్న కంపెనీలు  ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.