శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టుబడింది. జే9-1403 ఫ్లైట్ లో కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 233.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ట్రౌజర్ లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.11.49 లక్షలు ఉంటుందని తెలిపారు. బంగారాన్ని సీజ్ చేసి నిందితుడి అదుపులోకి తీసుకున్నారు.   






Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


నకిలీ వీసాలతో కువైట్ కు 44 మంది మహిళలు


నకిలీ వీసాలతో గల్ఫ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్‌ అధికారులు పట్టుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన 44 మంది మహిళలు ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరి అవసరాన్ని ఆసరాగా చేసుకున్న కొంత మంది దళారులు డబ్బులు తీసుకుని నకిలీ వీసాలు ఇచ్చారు. మహిళలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి టికెట్లు బుక్‌ చేశారు. దీంతో గల్ఫ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన మహిళలు వీసాలు, ధ్రువీకరణ పత్రాలు చూపించగా అవి నకిలీవని ఇమిగ్రేషన్‌ అధికారులు తేల్చారు.


Also Read: వీఆర్ఏ గౌతమ్ మృతి.. ఇసుక మాఫియాపై ఫ్యామిలీ అనుమానం


ముంబయిలో ఒకరు, ఏపీలో ఇద్దరు ఏజెంట్లు


మహిళలను ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు అప్పగించారు. మహిళలను ప్రశ్నించిన పోలీసులకు కొత్త విషయాలు తెలిశాయి. మహిళలందరూ ఒకే దేశానికి రెండు వీసాలతో బయలుదేరారు. విసిటింగ్ వీసా ఇండియన్ ఇమిగ్రేషన్ వద్ద ఎంప్లాయిమెంట్ వీసా కువైట్‌లో చూపించాలని దళారులు మహిళలతో నమ్మబలికారు. వీసా, ధ్రువపత్రాలను పరిశీలించేటప్పుడు ఎయిర్ పోర్టు అధికారులు వీటిని గుర్తించారు. ముంబయిలో ఉన్న ఓ ఏజెంట్, ఏపీలో ఇద్దరు సబ్ ఏజెంట్లు కలిసి మహిళలను దేశం దాటించేందుకు ప్రయత్నించారని పోలీసుల విచారణలో తెలింది. దళారులపై 420, 471 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 


Also Read: పదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులు... కీచక టీచర్ కు దేహశుద్ధి చేసిన బాలిక బంధువులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి