Hyderabad Crime News: ఆ అబ్బాయికి టీ తాగే దగ్గర ఓ అమ్మాయి పరిచయం అయింది. అది కాస్తా స్నేహంగా మారింది. అయితే అమ్మాయి చూసేందుకు అబ్బాయిలా ఉన్నప్పటికీ.. అతడు మొదటి చూపులోనే ఆమెను ఇష్టపడ్డాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. కానీ ఆమె మౌనం వహించింది. మౌనం అర్ధాంగికారం అనుకున్న అతడు.. ఆమెకు సంబంధించిన ఖర్చులన్నీ భరించాడు. ఓ మంచి రోజు చూసుకొని పెళ్లి చేసుకొమ్మని అడిగాడు. ఆమె మళ్లీ నోరు మెదకపోయే సరికి తానిచ్చిన డబ్బులు వెనక్కి ఇచ్చేయమన్నాడు. దీంతో ఆమె అతడితో గొడవకు దిగింది. కోపంతో ఊగిపోతూ అతడిపై బ్లేడుతో దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన యువకుడకి 50 కుట్లు పడ్డాయి. దవడ భాగంలో పెరాలసిస్ కూడా వచ్చింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


రాజమహేంద్ర వరంకు చెందిన రార్టర్డ్ అకౌంటెంట్.. భార్య, ఇద్దరు పిల్లతో కలిసి అక్కడే ఉంటున్నాడు. అయితే ఆయన 23 ఎళ్లు కుమార్తె లక్ష్మీ సౌమ్య బీబీఏ పూర్తి చేసింది. అయితే తండ్రితో ఆమెకు గొడవలు రాగా.. ఆరు నెలల క్రితం తల్లిదండ్రులను వదిలేసి హైదరాబాద్ కు వచ్చేసింది. క్రికెట్ కోచింగ్ తో పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పి.. కేపీహెచ్ బీ నాలుగో రోడ్డులోని శ్రీ తనూజ హాస్టల్ లో చేరింది. అయితే హాస్టల్ ను రోజూ రాత్రి 10 గంటలకు మూసి వేస్తారు. లక్ష్మీ సౌమ్య మాత్రం రోజూ పది తర్వాతే హాస్టల్ కు వచ్చేది. దీంతో ఆమె ప్రవర్తన నచ్చకు హాస్టల్ నిర్వాహకులు ఆమెను హాస్టల్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. దీంతో లక్ష్మీ సౌమ్య ఇటీవేల కేపీహెచ్ హీ తొమ్మిదో ఫేజ్ లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటోంది. అయితే లక్ష్మీ సౌమ్య హాస్టల్ లో ఉన్నప్పుడు అక్కడికి దగ్గర్లో ఉన్న దేవీ లగ్జీ బాయ్స్ హాస్టల్ లో ఉన్న ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతడే ఆశోక్ కుమార్.  


డబ్బులు ఇవ్వమంటే బ్లేడుతో దాడి చేసిన లక్ష్మీసౌమ్య


గుంటూరుకు చెందిన 27 ఏళ్ల నాదెండ్ల అశోక్ కుమార్ 7 నెలల క్రితమే హైదరాబాద్ కు వచ్చాడు. ఎస్ఏపీ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇతడి సోదరి కూడా సమీపంలోని ఓ హాస్టల్ లో ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. అశోక్ కుమార్, లక్ష్మీ సౌమ్య నిత్యం టీ స్టాల్ కు వెళ్లేవారు. అక్కడే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే అశోక్ లక్ష్మీ సౌమ్యను ఇష్టపడ్డాడు. చాలా సార్లు ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అయితే ఆమె మాత్రం మౌనం వహించింది. అలాగే లక్ష్మీ సౌమ్యకు అవసరం వచ్చినప్పుడల్లా అశోక్ నగదు ఇచ్చాడు. ఇదే చనువుతో ఆమెతో పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఈనెల 5వ తేదీన టీస్టాల్ వద్ద ఇద్దరూ కలిసిన సమయంలో ఆశోక్ పెళ్లి ప్రస్తావన తేగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈనెల 5వ తేదీన తన పుట్టిన రోజు ఉందని తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగాడు. దీంతో ఆమె ఇవ్వనని తెగేసి చెప్పింది. ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అశోక్ అనగానే ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మీ సౌమ్య తన దగ్గర ఉన్న బ్లేడుతో అతనిపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఆశోక్ ఎడమ చెంప నుంచి చెవి వరకు తీవ్ర గాయం అయింది. 


50 కుట్లు - దవడ భాగంలో పెరాలసిస్..


విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు పోలీసులు లక్ష్మీ సౌమ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పదునైన బ్లేడుతో బలంగా దాడి చేయడంతో అశోక్ చెంపపై భాగంలో భారీ గాయం అయింది. 50 కుట్లు పడ్డాయి. నరాలు తెగిపోవడం వల్ల దవడ భాగంలో కొంత మేరకు పెరాలసిస్ వచ్చిందని, అధికంగా రక్తస్రావం కావడంతో రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు.