రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు దిశ చట్టాలు , కఠిన శిక్షలు ప్రభుత్వం తీసుకుంటున్న కామాంధులు మాత్రం వారి ఆగడాలను ఆపడం లేదు. ఎక్కడో ఓ చోట దారుణమైన ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన ఘటన ప్రజలందర్నీ  తలదించుకునేలా చేసింది.


ఆడపిల్ల కనిపించింది అంటే చాలు కొందరు కీచకులు అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. దీంతో ఇలాంటి ఘటనలు అటు ఆడపిల్లల భద్రతను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు రాక్షసుల్లా మారిపోతున్న మనుషులు చివరికి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా ప్రాణాలు తీస్తున్న, వీడియోలు తీసి వేధిస్తున్న ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే జరిగింది.


ఇంట్లో ఎవరూ లేని సమయంలోచెవిటి, మూగ మహిళపై ఒక యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి ఎదురుగా ఉండే సాయి అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళను బాత్రూంలో బంధించి అత్యాచారం చేశాడు. బాధిత మహిళ భర్త కూడా దివ్యాంగుడే. తన తల్లిని తీసుకొని అతను బయటకు వెళ్లిన సమయంలో ఇంటిలోకి చొరబడిన సాయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 


బాధిత మహిళ మూగ కావడంతో సహాయం కోసం సైతం అరవలేని దుస్థితి ఆమోది. ఆపై బాత్రూంలోనే మహిళను ఉంచి గడియపెట్టి వెళ్లిపోయారు. ఇంటికి వచ్చి గమనించిన భర్త ఏమైందని అడగడంతో ఆమె జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో హుమాయున్ నగర్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు. గతంలోనూ అతని చేష్టలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు...
పుట్టుకతోనే చెవిటి మూగ మహిళపై అత్యాచారం చేసిన సాయి అనే యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. తాళం వేసిన గదిలో నిందితుడు దాక్కునట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


ఒకప్పుడు సాటి మనిషికి సహాయం చేయాలి అనే ఆలోచనతో ఉన్న మనిషి ఇప్పుడు ఏకంగా సహాయం చేయడం కాదు ఎలా ఇతరులను నాశనం చేయాలి అనే దుర్బుద్దితో కనిపిస్తున్నాడు. అయితే ఆడపిల్లల విషయంలో అయితే మరింత మృగంలా మారిపోతున్నాడు మనిషి. సమాజంలో బతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది అని చెప్పాలి. దీనికి కారణం మనుషులు తీరు పూర్తిగా మారిపోవడమే. ఒకప్పుడు సాటి మనిషికి సహాయం చేయాలి అనే ఆలోచనతో ఉన్న మనిషి ఇప్పుడు ఏకంగా సహాయం చేయడం కాదు ఎలా ఇతరులను నాశనం చేయాలి అనే దుర్బుద్దితో కనిపిస్తున్నాడు. అయితే ఆడపిల్లల విషయంలో అయితే మరింత మృగంలా మారిపోతున్నాడు మనిషి.