Hyderabad CBI officials arrest NHAI Project Dirictor:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) హైదరాబాద్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్ట్ డైరెక్టర్ గొల్లు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసింది. ఆయన రూ. 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు.  ఈ ఘటన హైదరాబాద్-వరంగల్ హైవేలోని బీబీనగర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగింది 

గొల్లు దుర్గాప్రసాద్, NHAI వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన బీబీనగర్ టోల్ ప్లాజా సమీపంలో హైవే పక్కన రెస్టారెంట్ నడుపుతున్న ఒక వ్యక్తి  లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు.  అందులో  రూ. 60,000 మొదటి వాయిదాగా తీసుకుంటూ అరెస్టయ్యాడని CBI తెలిపింది. దుర్గాప్రసాద్, హైవే పక్కన రెస్టారెంట్ నడపడానికి సంబంధించి అనుమతి లేదా సౌకర్యాల కోసం రెస్టారెంట్ యజమాని నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంత స్థలంలో ఉన్నా..  హైవే పక్కన హోటల్ నడపాలంటే  లంచం ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.  లేకపోతే తొలగిస్తామని హెచ్చరించినట్లుగా ఆరోపణలుఉన్నాయి.                 

బాధితులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. CBI ఈ కేసులో  స్పెషల్ ఆపరేషన్ నిర్‌వహించింది. దుర్గాప్రసాద్‌ను లంచం తీసుకుంటూ ఉన్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అరెస్టు సమయంలో, దుర్గాప్రసాద్‌తో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి  కూడా అరెస్టయ్యాడు.  CBI హైదరాబాద్, వరంగల్,  సదాశివపేటలో దుర్గాప్రసాద్‌కు సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.  ఈ సోదాల్లో అనేక ఆస్తుల పత్రాలు  స్వాధీనం చేసుకున్నారు.  CBI ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేస్తోంది, ఇందులో ఇతర అధికారులు లేదా వ్యక్తుల ప్రమేయం ఉందా అని కూడా పరిశీలిస్తోంది. 

ఈ ఘటన ఆగస్టు 20, 2025న జరిగినట్లు CBI ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.  ఈ కేసు, NHAI అధికారులు లంచాలు డిమాండ్ చేస్తూ, అవినీతిలో పాల్గొన్న ఇతర సంఘటనలతో పోల్చితే తక్కువ మొత్తం (₹60,000) లంచం  అయినప్పటికీ దుర్గా ప్రసాద్ పై చాలా ఆరోపణలు ఉండటంతో రెయిడ్ చేశారు.  గతంలో NHAI అధికారులు ₹10 లక్షలు లేదా ₹15 లక్షల బ్రైబరీ కేసుల్లో అరెస్టయిన సందర్భాలు ఉన్నాయి.  2024లో మధ్యప్రదేశ్‌లో ₹10 లక్షలు, 2025లో బీహార్‌లో ₹15 లక్షల బ్రైబరీ కేసుల్లో NHAI అధికారులు అరెస్టయ్యారు.