Hyderbad Crime : వ్యాపారి నుంచి డైమండ్ కొట్టేసిన ఓ నిందితున్ని హైదరాబాద్ అప్జల్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ ఈ కేసు వివరాలు మీడియాతో తెలిపారు. కర్ణాటకకు చెందిన మహమ్మద్ రుయీలా  ఆన్లైన్ లో సూరత్ కి చెందిన ఓ నగల వ్యాపారిని తాను డైమాండ్స్ వ్యాపారం చేస్తానని నమ్మించాడు. ఆ వ్యాపారిని ఒక డైమండ్ కావాలని హైదరాబాద్ కు పిలిపించారు. అప్జల్ గంజ్ లోని అంబికా లాడ్జ్ లో సూరత్ కు చెందిన వ్యాపారి వివేక్ జతిన్ జావేద్  నిందితుడు మహమ్మద్ రుయీలా కలిశాడు. డైమండ్ కొట్టేసేందుకు ప్లాన్ వేసి డైమండ్ చూపించమని చెప్పి, అనంతరం వ్యాపారి దృష్టిమరల్చి అతని వద్ద ఉన్న 18 లక్షల విలువ చేసే ఒరిజినల్ డైమండ్ ను తీసుకుని నకిలీ డైమండ్ పెట్టారు. అనంతరం ఆ డైమండ్ నకిలీ అని తేలడంతో వ్యాపారి స్థానిక అప్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. కర్ణాటకకు వెళ్లి నిందితుడు మహమ్మద్ రుయీలా ను అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న డైమండ్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50 వేల నగదు, 4 సెల్ ఫోన్, 1 బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సునీల్ దత్ తెలిపారు.



చెత్త సేకరణ ముసుగులో చోరీలు


 మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో చిత్తు కాగితాల సేకరణ ముసుగులో చోరీకి పాల్పడిన నలుగురు నిందితులను సీసీఎస్, మట్వాడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన ఆలేటి మైసమ్మ ఆలియాస్ కడమంచి మైసమ్మ, ఊర దివ్య, నూనె రామక్క నూనె ఎల్లయ్య అలియాస్ గజ్జి ఎల్లయ్య ఉన్నారు. నిందితుల నుంచి సుమారు రెండు లక్షల రూపాయల విలువగల జనరేటర్ రేడియేటర్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 


అసలేం జరిగింది? 


ఈ కేసుకు సంబంధించి వరంగల్ ఏసీపీ గిరికుమార్ వివరాలను వెల్లడిస్తూ... పోలీసులు అరెస్ట్ చేసిన నిందితురాళ్లు ముగ్గురు దగ్గరి బంధువులని తెలిపారు. వీళ్లంతా చిత్తు కాగితాలు, పాత ఇనుప సామాను సేకరిస్తూ జీవించేవారు. కొద్ది రోజుల క్రితం ఈ ముగ్గురు మట్వాడాలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ప్రముఖ కంపెనీ చెందిన వర్క్ షాపు కంపౌడ్లో ఉన్న జనరేటర్ రేడియటర్ ను చోరీ చేసి దానిని అమ్మి డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇదే తడువుగా ఈ ముగ్గురు తమ ప్రాంతానికి చెందిన మరో నిందితుడు ఆటో డ్రైవర్ సహకారంతో ఈనెల 13న ఖరీదైన జనరేటర్ రేడియోటర్ ను చోరీ చేశారు. చోరీ చేసిన రేడియోటర్ ను కొద్ది రోజుల తరువాత అమ్మి సొమ్ము చేసుకుందామని ఈ నలుగురు నిందితులు వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు వెనుక చెట్ట పొదల్లో రేడియోటర్ ను రహస్యంగా భద్రపర్చారు. ఈ చోరీపై కంపెనీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిందితులను గుర్తించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం ఈ నలుగురు నిందితులు రేడియోటర్ ను అమ్మేందుకు ఆటోనగర్ కు వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో ఆటోనగర్ లో కాపుగాచిన పోలీసులు నిందితులు పట్టుకోని విచారించగా చోరీని అంగీకరించారు. ఆలేటి మైసమ్మ, దివ్యలు గతంలో ఆత్మకూర్, మట్వాడా పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కారు.