Hyderabad Actress Files Complaint Over Harassment : సినిమాల్లో ఛాన్సెస్ ఇప్పిస్తానని తనతో ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ నటి పోలీసులను ఆశ్రయించారు. దీనిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సినిమా రంగంలో కొన్నేళ్లుగా ఉన్న ఓ సినీ నటికి 'ఆకాశంలో ఓ తార' మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇప్పిస్తానంటూ ప్రసాద్ అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ఆమెను సంప్రదించాడు. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయితే, ఆ సినిమాలో నటించినందుకు ఆమెకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ రూ.90 వేలతో పాటు ప్రయాణ ఖర్చులు రూ.38 వేలు కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు.
తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని సదరు నటి గట్టిగా అడగ్గా... ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లో ఉండే ఓ ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్ద కలవాలని ఆమెను పిలిపించిన ప్రసాద్... డబ్బులు ఇవ్వకుండా బెదిరించాడు. ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కొంత దూరం వెళ్లాక మరిన్ని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, తన కోరిక తీర్చాలంటూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. భయం, అవమానంతో ఈ ఘటనను నటి తల్లికి చెప్పింది. దీంతో ప్రసాద్‌కు ఫోన్ చేసి తల్లి అడగ్గా... ఆమెకు కూడా దుర్భాషలాడి బెదిరించాడు. దీంతో నిందితుడి నుంచి రక్షణ కల్పించాలని నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేశారు.
Also Read : Nivetha Pethuraj : ఛాన్స్ ఇవ్వకుంటే హిమాలయాలకు వెళ్లిపోయేదాన్ని - హీరోయిన్ నివేదా కామెంట్స్
