అది కరీంనగర్‌లోని భరత్‌ నగర్ కాలనీలో ఓ ఇల్లు. ఆ ఇంట్లో ఓ రూమ్‌కి తాళం వేసి ఉంది. కానీ ఆ రూమ్‌లో మాత్రం ఇద్దరు మనుషులున్నారు. ఓ ఆడ.. ఓ మగ.  వాళ్లిద్దరూ గట్టిగా అరవడం లేదు. కానీ భయం భయంగా చూస్తున్నారు., ఎలా బయటకు రావాలా అని టెన్షన్ పడుతున్నారు. తాళం వేసిన వాళ్లు వచ్చే లోపు బయటకు వచ్చేస్తే చాలనుకుంటున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కాసేపటికే తాళం వేసిన వ్యక్తి కొంత మంది పోలీసుల్ని తీసుకొచ్చాడు. తలుపు తీసి చూపించాడు. ఆ జంటలో ఉన్న మగ వ్యక్తిని చెప్పుతో చెడామడా కొట్టాడు. పోలీసులు ఆపి అతన్ని.. మహిళను అక్కడ్నుంచి తీసుకెళ్లారు. అసలు వీరెవరు ? ఆ రూమ్‌లో ఎందుకున్నారు ? తాళం వేసి పోలీసుల్ని ఎందుకు తీసుకొచ్చారు ? అసలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ? ఇవన్నీ తెలిస్తే కానీ ఈ స్టోరీలో ట్విస్ట్ అర్థం కాదు. 


కరీంనగర్‌కు చెందిన రాజేశం భార్యతో కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  భార్య ప్రభుత్వ ఉద్యోగిని.  రోజూ లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీసుకు వెళ్లి సాయంత్రం ఠంచన్‌గా ఇంటికి వస్తుంది. కొన్నాళ్ల పాటు  వీరి కాపురం బాగానే ఉంది కానీ ఇటీవల వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య తనతో ఎందుకు గొడవపడుతోందో రాజేశానికి అర్థం కాలేదు. కానీ సన్నిహితంగా ఉండకపోతూండటంతో ఏదో తేడా కొడుతుందని గ్రహించాడు. రోజూ నిఘా పెట్టి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. 


అదేమిటంటే రోజూ తన భార్య ఆఫీసుకని బాక్స్ కట్టుకుని వెళ్తోంది. కానీ ఎక్కువ సార్లు ఆఫీసుకు వెళ్లడం లేదు. భరత్‌నగర్‌లో ఉన్న తన సోదరుడికి చెందిన ఇంటికి వెళ్తోంది. అక్కడ ఖాళీగా ఉన్న పోర్షన్‌లోకి వెళ్తోంది. కాసేపటికో లేదా అంతకు ముందో మరో వ్యక్తి అక్కడ ఉంటున్నాడు. అక్కడ ఓ గంటా.. రెండు గంటలు గడిపిన తర్వాత ఇద్దరూ బయటకు వచ్చి వెళ్తున్నారు. దీన్ని చూసిన రాజేశానికి తన భార్య తప్పు చేస్తోందని అర్థమైంది. అందుకే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని డిసైడయ్యి ఓ రోజు ఫాలో అయ్యారు. వాళ్లిద్దరూ రూమ్ లోకి వెళ్లగానే బయట గడియపెట్టి తాళం వేసి వెళ్లి పోలీసుల్ని తీసుకొచ్చారు. 


తన భార్యతో గదిలో గడుపుతోంది ఆమె సహోద్యోగి శశిధర్ అని రాజేశం గుర్తించారు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధానికి తన బావమరిది కూడా సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీరి మధ్య ఆర్థికపరమైన లావాదేవీల వివాదాలు కూడా ఉన్నాయని తర్వాత గుర్తించారు. ఇక ఎన్ని  ఉపస్టోరీలు ఉన్నా.. అసలు భార్యను రెడ్ హ్యాండెండ్‌గా పట్టించిన భర్త ఇంటికెళ్లిపోయాడు., అసలు ఈ స్టోరీలో కొసమెరుపేమిటంటే... సహోద్యోగితో వివాహేతర బంధం పెట్టుకున్న రాజేశం భార్యకు అంధత్వ సర్టిఫికెట్‌తో ఉద్యోగం తెచ్చుకుంది.