Gorakhpur Husband killed wife: అనుమానం పెనుభూతం. భార్యపై అనుమానం వస్తే అది ఎక్కడికి దారి తీస్తుందో చెప్పడం కష్టం. ఇలాంటి ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని గుల్రిహా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇటీవలే వివాహం చేసుకున్న ఒక వ్యక్తి తన భార్యను చంపేశాడు.దానికి కారణం తన అన్నతో వివాహేతర బంధం తన భార్య పెట్టుకుందని అనుమానించడమే. ఈ అనుమానానికి కారణం.. ఆమె చేసిన కూర బాగుదంని అతని అన్నయ్య ప్రశంసించడం. విచిత్రంగా ఉన్నా ఇది నిజం.
కొత్తగా ఇంటికి వచ్చిన భార్య కూర బాగా చేసిందని ప్రశంసలు
గోరఖ్ పూర్ సమీపంలోని నారాయణపూర్ గ్రామం నివాసి సతీష్, ఫిబ్రవరి 13న సరోజ్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సంప్రదాయం ప్రకారం వివాహం తర్వాత సరోజ్ ఏప్రిల్ 21న తన అత్తమామల ఇంటికి వెళ్లింది. వారిది ఉమ్మడి కుటుంబం. సరోజ్ ఇంటికి వచ్చిన రోజున వంట చేసింది. ఆమె వంటను అందరూ అభినందించారు. ముఖ్యంగా సతీష్ సోదరుడు కూడా ఆమె వంట బాగుందని ప్రశంసించాడు. ఆ తర్వాత సతీష్ సైలెంట్ అయిపోయాడు. అదే సమయంలో తన అన్నయ్య.. ఇంట్లో అండర్ వేర్‌తో తిరుగుతూండటం చూశాడు. తన భార్య వంటను పొగడటం.. లో దుస్తులతో తన సోదరుడు తిరుగుతూండటంతో ఇద్దరి మధ్య ఏదో ఉందని సతీష్ అనుకున్నారు.
అన్నతో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో హత్య
ఆ అనుమానం పెనుభూతంగా మారింది. చివరికి అది బెడ్ రూమ్ లో గొడవకు దారి తీసింది. తనను అకారణంగా అనుమానిస్తున్నాడని సరోజ్ బాధపడింది ..కానీ ఆ బాధ ఎక్కువ సేపు ఉండకుండా సతీష్ కీలక నిరణయం తీసుకుంది. బెడ్‌రూమ్‌లోనే భార్యను గొంతు కోసి చంపి, రాత్రంతా ఆమె మృతదేహంతో కూర్చున్నాడు. చంపినట్లుగా ఎవరికీ తెలియకుండా ఉదయమే కిందకు వచ్చాడు. మొదటి అంతస్తులోని తన సోదరుడు అతిష్ గదికి వెళ్ళాడు. అతీష్ కు అప్పటికే పెళ్లిఅయింది. ఆయన భార్య పూజ చేసుకుంటోంది. ఆ సమయంలో ఎందుకొచ్చావిని అడిగితే.. వేడిగా ఉందని చెప్పి.. సోదరుడి గదిలోకి వెళ్లాడు.
అనుమానంతో కుటుంబంతో సర్వనాశనం
నిద్రపోతున్న అతిష్ గదిలోకి ప్రవేశించి సుత్తితో తలపై కొట్టి హ త్యాయత్నం చేశాడు. గొడవ విని, కుటుంబ సభ్యులు పరుగెత్తుకుంటూ వచ్చింది, సతీష్ పారిపోయాడు. అతిష్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. సరోజ్ తండ్రి గుల్రిహా పోలీస్ స్టేషన్‌లో తన కుమార్తెను చంపేశారని కేసు పెట్టారు. సతీష్ కుటుంబసభ్యులందరిపై కేసు పెట్టారు. పోలీసులు సతీష్‌ను అరెస్టు ఛేశారు. ఎటువంటి ఆధారాలు లేనప్పటి కేవలం అనుమానంతోనే తన అన్నయ్య , భార్య మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించి హత్య చేశానని అంగీకరించాడు. అతని చర్యతో కుటుంబం అంతా ఇబ్బంది పడింది.