Crime News in Telugu: యూపీలో దారుణ ఘటన జరిగింది. వెడ్డింగ్ గిఫ్ట్ గురించి వచ్చిన గొడవలో భార్య భర్తని హత్య చేయించింది. చంద్రప్రకాశ్ మిశ్రా తన చెల్లి పెళ్లికి గోల్డ్ రింగ్, టీవీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ విషయంలోనే భార్య గొడవ పడింది. రెండు గిఫ్ట్‌లు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ వాదించింది. కానీ అందుకు చంద్రప్రకాశ్ ఒప్పుకోలేదు. కచ్చితంగా ఇచ్చి తీరతానని చెప్పాడు. ఈ చిన్న గొడవ కాస్తా పెద్దదైంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న భార్య తన కుటుంబ సభ్యులతో ఇదంతా చెప్పింది. వెంటనే ఆమె సోదరుడు చంద్రప్రకాశ్‌పై దాడి చేశాడు. కర్రలతో దాదాపు గంటపాటు విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ దెబ్బలకు తాళలేక బాధితుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుని భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులనూ అరెస్ట్ చేశారు.
చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్ గిఫ్ట్‌గా ఇచ్చాడని భర్తతో గొడవ, దారుణంగా చంపించిన భార్య
Ram Manohar
Updated at:
24 Apr 2024 05:44 PM (IST)
UP Crime News: చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్ ఇచ్చాడన్న కోపంతో భార్య భర్తను దారుణంగా కొట్టి చంపించిన ఘటన సంచలనమైంది.
చెల్లె పెళ్లికి గోల్డ్ రింగ్ ఇచ్చాడన్న కోపంతో భార్య భర్తను దారుణంగా కొట్టి చంపించిన ఘటన సంచలనమైంది.
NEXT
PREV
Published at:
24 Apr 2024 05:43 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -