Ram Gopal Varma About Clash with Amitabh Bachchan: వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్‌ చేస్తారో తెలియదు. ఈ మధ్య ఆయన ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అవుతుంది. ఎప్పుడు తన కామెంట్స్‌లో వివాదాల్లో చిక్కుకుంటాడు వర్మ. ఎన్ని వివాదాలు చూట్టుముట్టిన తగ్గేదే లే అంటాడు. ఒకప్పుడు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ కొనసాగాడు వర్మ. టాలీవుడ్‌, బాలీవుడ్‌కు 'క్షణక్షణం', 'ఆత్మ', 'దెయ్యం', 'రంగీల' వంటి హిట్స్‌ చిత్రాలు ఇచ్చారు. ఇక ముఖ్యంగా బాలీవుడ్ హీరోలు, నటీనటులతో వర్మకు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌తో కూడా ఆర్జీవీ మంచి సన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి.


అయితే ఎప్పుడు కూడా వీరిద్దరు ఒకరిపై ఒకరు గౌరవంతో ఉండేవారని, ఒకరినొకరు సపోర్టు చేసుకుంటూ సినిమాలు పూర్తి చేసేవారట. అలా ఎన్నో సినిమాలు కలిసి చేసిన వీరిద్దరి మధ్య ఓ సినిమా టైంలో విభేదం తలెత్తిందట. అప్పటి వరకు ఒకరిని చెప్పింది ఒకరు గౌరవంతో వినే వారి మధ్య సర్కార్‌ మూవీ షూటింగ్‌ టైంలో ఓ సీన్‌ షూటింగ్‌ విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జీవీ ఓ ఇంటర్య్వూలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. 2005 అమితాబ్‌తో సర్కార్‌ మూవీ తెరకెక్కించారు. అలాగే ఈ చిత్రంలో అమితాబ్‌ కొడుకు అభిషేక్‌ బచ్చన్‌. కె.కె మీనన్‌, కత్రినా కైఫ్‌, తనిషా ముఖర్జీలు కీలక పాత్రలు పోషించారు. అయితే ఇందులో అమితాబ్‌ కొడుకుగా కె.కె మీనన్‌ నటించగా.. ఒకసారి తండ్రి కొడుకుల మధ్య గొడవ సీన్‌ షూట్‌ చేస్తున్నారు.


ఆ సీన్ షూటింగ్ లో నాతో విభేదించారు


అయితే ఈ సీన్‌లో అమితాబ్, ఆర్జీవీ చెప్పినదాన్ని విభేదించారట. అది తండ్రి, కొడుకుల మధ్య గొడవ సీన్‌. ఒక తండ్రికి కొడుకు మీద  హోప్స్‌ ఉన్నప్పుడే కోపం, ఎమోషన్స్‌ ఉంటాయి. అదే కొడుకు ప్రయోజకుడు కాదని తెలిసి ఆ తండ్రికి అతడిపై ఎలాంటి హోప్స్‌ ఉండవు. ఆ టైంలో ఆ తండ్రి కొడుకుపై ఆగ్రహం కానీ, బాధ కానీ, భావోద్వేగాలు కానీ ఏం చూపించడు. 'సర్కార్‌'లో ఆ సీన్‌ కూడా అదే. ఇద్దరు తండ్రి కొడుకులు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర గొడవ పడే సీన్‌ అది. ఆ సన్నివేశంలో షూట్‌ చేస్తున్నప్పుడు అమితాబ్‌తో నేను ఇదే చెప్పాడు. కొడుకపై హోప్స్‌ కోల్పోయిన తండ్రిగా మీరు ఎలాంటి భావోద్వేగం, కోపం కానీ చూపించకుడదు. అలా మొండిగా ఎలాంటి ఎక్స్‌ప్రెషన్‌ లేకుండా ఉండాలని అన్నాను.



కానీ ఆయన అలా ఎలా ఉంటుంది. తండ్రి అన్నాక కొడుకుపై కోపం చూపిస్తానే సీన్‌ పండుతుందని నాతో వాదించారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య కాసేపు వాదన జరిగింది. చివరికి నేను ఆయన వాదించలేక, అమితాబ్‌ సూచన మేరకు ఆ సీన్‌ షూట్‌ చేశాను. షూటింగ్‌ తర్వాత ఇంటికి వెళ్లిన అమితాబ్‌ రాత్రి నాకు ఫోన్‌ చేశారు. ఆర్జీవీ మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. మీరు చెప్పిందే సరైనది అనిపిస్తుంది. రేపు మళ్లీ ఆ సీన్‌ను రీ షూట్‌ చేద్దామన్నారు. అప్పుడు నాకు అమితాబ్‌ గారి మాటలు ఆశ్చర్యం వేశాయి. ఆ తర్వాత రోజు ఈ సన్నివేశాన్ని రీషూట్‌ చేశాం. చాలా బాగా వచ్చింది. ఆ సీన్‌ను అమితాబ్‌ నేను ఊహించిన దానికంటే కూడా బాగా చేశారు" అంటూ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 



Also Read: ఏపీ రాజకీయాలపై నారా రోహిత్‌ హాట్‌ కామెంట్స్‌ - 'ప్రతినిధి 2' వాయిదాపై ఏమన్నాడంటే!