Howrah porn torture Crime case: పోర్న్ వీడియోల్లో నటించేందుకు అమ్మాయిని ట్రాప్ చేసి, టార్చర్ చేసిన కేసు కోల్ కతాలో సంచలనం రేపుతోంది.  హౌరా పోర్న్ టార్చర్ కేసుగా చెబుతున్న ఈ కేసు  పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా, డొమ్‌జూర్‌లోని బంక్రా-ఫకీర్‌పరాలో జరిగింది.  22-23 ఏళ్ల యువతిని ఆర్యన్ ఖాన్, అతని తల్లి ష్వేతా ఖాన్ , సోదరి జోయా ఖాన్ బంధించి పోర్న్ వీడియోల్లో నటించాలని చిత్ర  హింసలు పెట్టారు. 


బాధితురాలు సోదేపూర్‌కు చెందినవారు.  ఆర్యన్‌తో  సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది.  ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువతిని  హౌరాలోని ఫ్లాట్‌కు తీసుకెళ్లారు.  అక్కడ ఆమెను 5-6 నెలల పాటు బంధించి  పోర్న్ వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.  నిరాకరించడంతో ఇనుప రాడ్‌తో కొట్టి, సిగరెట్ లతో కాల్చి, జుట్టు కత్తిరించి హింసించారు. జూన్ 7, 2025న ఆర్యన్ బామ్మ సహాయంతో బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఆర్యన్‌ను జూన్ 11న కోల్‌కతాలో, జోయాను సోనార్‌పూర్‌లో అరెస్టు చేశారు. ష్వేతా ఖాన్ పరారీలో ఉంది. 



ఉద్యోగం కల్పిస్తారన్న ఆశతో నమ్మి వచ్చిన యువతిని అత్యంత ఘోరంగా టార్చర్ పెట్టారు. తిండి కూడా పెట్టకుండా రోజుల తరబడి ఉంచారు . జూన్ 7, 2025న, బాధితురాలు ఆర్యన్ ఖాన్ ఇంటిలోని సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసిన అతని బామ్మ సహాయంతో తప్పించుకుని, సోదేపూర్‌లోని తన ఇంటికి చేరుకుంది. ఆమె కుటుంబం వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి, ఖర్దా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆర్యన్ ఖాన్, అతని తల్లి ఇషారా ప్రొడక్షన్స్  అనే పేరుతో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. కానీ యువతులను ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసి పోర్న్ వీడియోలను తీస్తున్నారు. వారిని వేశ్యా వృత్తిలోకి దింపుతున్నారు.  



నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ (NCW) ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. పశ్చిమ బెంగాల్ DGP రాజీవ్ కుమార్‌కు 3 రోజుల్లో చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పరారీలో ఉన్న ఆర్యన్ ఖాన్ తల్లి శ్వేతా ఖాన్ గతంలో బార్ డాన్సర్‌గా పనిచేసింది .  2015 నుండి  ఆమెకు నేర చరిత్ర ఉంది.  శ్వేతా ఖాన్ తన టీనేజ్ కుమార్తె ఇషికాను కూడా అనైతిక కార్యకలాపాల్లోకి నెట్టివేయడానికి ప్రయత్నించిందని..  దీని కారణంగా ఇషికా ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి.