రాప్తాడులోని కనగానపల్లి మండల కేంద్రానికి చెందిన చిట్రా మురళి, ములుగూరు వీణ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. వాళ్లను ఎదురించి గత జూన్ 23 న ఈ జంట వివాహం చేసుకుంది. చిట్రా మురళీ కియాలో ఉద్యోగం చేస్తున్నాడు. వీణ కనగానపల్లి ఏలకుంట్లలో గ్రామ సచివాలయ మహిళా పోలీసుగా పని చేస్తోంది.


తన మాట కాదని కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందని కోపంతో  వీణ తల్లి ములుగూరు యశోదమ్మకు వీళ్లపై పగ పెంచుకుంది. ఎలాగైనా మురళిని చంపి కుమార్తెను తీసుకొస్తానని శపథం చేసింది. అనుకున్నట్టుగానే సమయం కోసం ఎదురు చూసి స్పాట్ పెట్టి మురళిని హత్య చేయించింది. 


కొత్తగా పెళ్లిన ఈ జంట రాప్తాడులోని అంబేద్కర్‌ నగర్‌లో కాపురం పెట్టారు. రోజూ ఎవరి ఉద్యోగానికి వాళ్లు వెళ్లిపోయేవాళ్లు చాలా సంతోషంగా ఉండే వాళ్లు. వీళ్ల పెళ్లి ఇష్టం లేని వీణ ఫ్యామిలీ మాత్రం వీళ్లను నీడలా వెంటాడుతూ సమయం కోసం ఎదురు చూశారు.  తన శపథాన్ని నెరవేర్చుకునేందుకు యశోదమ్మ బంధువుల హెల్ప్ తీసుకుంది. అప్పన్నగారి వెంకటేశులు, టి.సి. సుబ్రమణ్యంతో చర్చించింది. వారి ద్వారా సాకే సర్దార్‌ను సంప్రదించి రూ. 10 లక్షలు కిరాయికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏప్రిల్ 26 న రూ. 2 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చి మిగితా మొత్తం హత్య చేశాక ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు.  


మురళి హత్యకు అడ్వాన్స్ తీసుకున్న సాకే సర్దార్ తన ముఠా సభ్యులైన  రవి, సయ్యద్ సద్దాం, పెనకలపాటి సుబ్రమణ్యం, పెనకలపాటి ప్రకాష్‌ ప్లాన్ చెప్పాడు. మురళి... ఉద్యోగం చేసేందుకు వెళ్లడం... అతను ఎలా వెళ్తాడు, ఎలా వెళ్లి వస్తాడో రెక్కీ నిర్వహించారు. పథకం ప్రకారం ఈనెల 16 న ఉద్యెగానికి వెళ్లేందుకు రాప్తాడు సమీపంలోని హైవేలో కియ బస్సు కోసం వేచి ఉన్న మురళీని ఆటోలో కిడ్నాప్ చేశారు. 


E రవి బైకులో ముందు వెళ్లడం... సయ్యద్ సద్దాం, పెనకలపాటి సుబ్రమణ్యం, పెనకలపాటి ప్రకాష్  ఆటోలో చిట్రా మురళీని అదమపట్టి బొమ్మేపర్తి పొలాల్లోకి తీసుకెళ్లారు. ఈ నలుగురు కలసి దారుణంగా, విచక్షణారహితంగా కత్తులతో గొంతు కోసి మురళిని హత్య చేశారు. ఆ తర్వాత పరారయ్యారు.


తల్లిపై అనుమానం వ్యక్తం చేసిన కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కూపీ లాగితే హంతకులు తేలారు. 8 మంది నిందితులు అరెస్టు చేసిన పోలీసులు ఆటో, బైకు, రూ. 4,70,000 నగదు, 2 చాకులు స్వాధీనం చేసుకున్నారు.