Woman found in Suitcase:


గుడ్‌గావ్‌లో ఘటన..


గుడ్‌గావ్‌లో దారుణ హత్య జరిగింది. ఇఫ్కో చౌక్‌లో ఓ సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం కనిపించటం కలకలం రేపింది. మృతురాలు నగ్నంగా ఉండటాన్ని గుర్తించారు పోలీసులు. అంతే కాదు. ఆమె ప్రైవేట్‌ పార్ట్స్ పైనా గాయాలున్నాయని, కొన్ని చోట్ల సిగరెట్‌తో కాల్చిన గాయూలూ కనిపించాయని పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ-గుడ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌ వే లోని ఇఫ్కో చౌరస్తా ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఇక్కడ ఇలా సూట్‌కేస్‌ వదిలి వెళ్లిన వాళ్లెవరో అని విచారణ జరుపుతున్నారు. అయితే...సమీపంలోని CCTVలో నిందితుడు సూట్‌కేస్‌ను వదిలి వెళ్లిన దృశ్యాలు రికార్డ్‌ అయినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఈ మృతదేహం ఎవరిది..? ఎవరు చంపారు..? ఎందుకు చంపారు అన్నది ఇంకా తేలలేదు. మృతురాలి ఫోటోని అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పంపారు. ఈ మధ్య కాలంలో కనిపించకుండా పోయిన మహిళల జాబితానూ పరిశీలి స్తున్నారు. ఎవరైనా ఆమె గురించి ఫిర్యాదు చేశారా అన్న కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ ఆటోరిక్షా డ్రైవర్ సూట్‌కేస్‌ని గుర్తించి పోలీసులు కాల్ చేసి చెప్పాడు. ఇఫ్‌కో చౌక్ వద్ద దాదాపు 11 సీసీ కెమెరాలున్నాయని, నిందితుడి కదలికలు చాలా స్పష్టంగా రికార్డ్‌ అవుతాయనిచెబుతున్నారు. అయితే...ఈ సూట్‌కేస్‌ లభించిన ప్రాంతం "బ్లైండ్ స్పాట్" అని వెల్లడించారు. ఎమ్‌జీ రోడ్‌లోని ఓ పెట్రోల్ బంక్ వెనక ఈ సూట్‌కేస్ కనిపించింది. 


కేరళలోనూ దారుణం..


కేరళలో దారుణం జరిగింది. ఓ జంట ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా హత్య చేశారు. నరబలి ఇస్తే సంపన్నులైపోతామని నమ్మిన దంపతులు...ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేయడమే కాకుండా...శరీరాన్ని 56 ముక్కలుగా కోశారు. ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే...వాళ్ల మాంసాన్ని కూడా తిన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. రోసెలిన్, పద్మ అనే ఇద్దరు మహిళలు చిత్రహింసకు గురై మృతి చెందారని విచారణలో తేలింది. చేతులు వెనక్కి కట్టేసి ఛాతీ భాగంపై తీవ్రంగా గాయం చేసి, కావాలనే రక్తంపోయే వరకూ హింసించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒకరి శరీరాన్ని 56 ముక్కలుగా కోసి మూడు గోతులు తవ్వి వాటిలో ఆ అవయ వాలను పాతి పెట్టారు. ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మిన దంపతులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. వీరికి మరో ఏజెంట్ సాయపడ్డాడు. అయితే...లైంగిక వేధింపులకూ గురి చేసినట్టు భావిస్తున్నారు పోలీసులు. నిందితులను విచారిస్తున్న సమయంలోనేపోలీసుల ప్రశ్నలకు సమాధానంగా "మేం వాళ్ల మాంసాన్ని తిన్నాం" అని షాకింగ్ సమాధానమిచ్చారట. అయితే...పోలీసులు మాత్రం దీన్ని ఇంకా నిర్ధరించలేదు. "ఇది నిరూపించాలంటే మాకు ఆధారాలు దొరకాలి" అని వెల్లడించారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. మృతుల్లో ఒకరైన రోసెలిన్ జూన్‌లో కనిపించకుండా పోయింది. ఆ తరవాత సెప్టెంబర్‌లో పద్మ మిస్సింగ్‌ అయినట్టు తేలింది. 


Also Read: Titanic: సముద్రగర్భంలో టైటానిక్ టూర్, ముప్పయ్యేళ్ల కష్టాన్ని ఖర్చు చేసి శిధిలాలను చూసి వచ్చిన మహిళ