Brother stabs sister 84 times: ఓ అన్న  తన చెల్లిని  పొడిచి చంపేశాడు. అలా ఇలా కాదు.. ఏకంగా84 సార్లు కత్తితో పొడిచి కసీదీరా చంపాడు.  పైగా తాను ఇలా చేశానని తల్లికి చెప్పడానికి ఆమెను ఆఫీస్ నుంచి నీకో సర్ ప్రైజ్ ఉంది పదా అంటూ ఇంటికి తీసుకెళ్లాడు.   "నీకో సర్‌ప్రైజ్ ఉంది అమ్మ.. ఇంటికి పద" అంటూ ఒక కొడుకు పిలిచిన పిలుపు, ఆ తల్లికి జీవితాంతం మర్చిపోలేని మృత్యు గీతంగా మారుతుందని ఆమె ఊహించలేదు. గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కవలలు హార్దిక్, హిమశిఖల మధ్య తలెత్తిన చిన్న వివాదం.. ఒక ఘోర కలికి దారితీసింది.

Continues below advertisement

 అసూయ.. ఆవేశం.. 84 పోట్లు! 

హార్దిక్, హిమశిఖ ఇద్దరూ 25 ఏళ్ల కవలలు. సోదరి హిమశిఖ ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ చదువుతుండగా, హార్దిక్ ఏడాదిన్నర క్రితమే తన ఉద్యోగాన్ని వదిలేసి సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పూణేకు చెందిన ఒక అమ్మాయితో ప్రేమలో పడి, ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ముందు కెరీర్ మీద దృష్టి పెట్టు.. ఆ తర్వాతే పెళ్లి  అని తల్లి, సోదరి వారించడం హార్దిక్‌లో కక్షను పెంచింది. మార్చి 6న ఇదే విషయంపై జరిగిన గొడవలో హార్దిక్ విచక్షణ కోల్పోయాడు. వంటగదిలోని కత్తి తీసుకుని తన సొంత సోదరిపై దాడి చేశాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం.. హార్దిక్ తన సోదరిని ఏకంగా  84 సార్లు కత్తితో పొడిచి అత్యంత క్రూరంగా హతమార్చాడు.

Continues below advertisement

 సర్‌ప్రైజ్ పేరుతో తల్లిపై మృత్యు దాడి 

సోదరిని చంపిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా హార్దిక్ తన తల్లి నీలిమ పని చేసే ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లాడు.  అమ్మ.. నీకో సర్‌ప్రైజ్ ఉంది, వెంటనే ఇంటికి పద  అని ఆమెను నమ్మించి తీసుకువచ్చాడు. ఇంటి తలుపు తీయగానే రక్తపు మడుగులో పడి ఉన్న కూతురిని చూసి ఆ తల్లి షాక్‌తో కేకలు వేసింది. ఆమె తేరుకునే లోపే హార్దిక్ ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆమె ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకు రావడంతో, హార్దిక్  అక్కడి నుంచి పరారయ్యాడు. అదృష్టవశాత్తూ ఆ తల్లి ప్రాణాపాయం నుంచి బయటపడింది.

24 గంటల్లోనే  అరెస్టు

ఈ ఘోరకలి జరిగిన 24 గంటల్లోనే మొరాదాబాద్ పోలీసులు హార్దిక్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతను చెప్పిన సమాధానాలు విని పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు.  కెరీర్ గురించి వారు చెప్పే సలహాలు నాలో అసహనాన్ని పెంచాయి.. అందుకే చంపేశాను అని అతను నిమ్మళంగా ఒప్పుకున్నాడు. సోషల్ మీడియా వ్యామోహం, కెరీర్ పట్ల బాధ్యతారాహిత్యం ఒక యువకుడిని ఎంతటి కిరాతకుడిగా మార్చాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.