సామాజిక మాధ్యమాలు మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయాయి. అవి ఎంతలా చొచ్చుకుపోతున్నాయంటే మన జీవితంలో జరిగిన ప్రతీ విషయాన్ని అందులో షేర్ చేసుకునేంతగా మారిపోయింది. సోషల్ మీడియా(Social Media) క్రమంగా మనల్ని కంట్రోల్ చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పుడు వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఒక విషయాన్ని క్షణాల్లో వైరల్ చేసి అందరికీ తెలిసేలా చేస్తున్నాయి. కొన్ని సార్లు అనవసర విషయాలను కూడా ట్రెండ్(Trend) చేస్తూ ఇతరులను ప్రభావితం చేసే స్థాయికి సామాజిక మాధ్యమాలు విస్తరిస్తున్నాయి. ఇలాంటి ఓ సామాజిక మాధ్యమం వల్ల ఓ వ్యక్తి రెండు సార్లు కిడ్నాప్ అయ్యాడు.  


ఫేస్‌బుక్‌(Facebook) లో పరిచమైన ఇద్దరు వ్యక్తులు మంచి స్నేహితులు అయ్యారు. నిత్యం చాటింగ్ చేసుకుంటా బాగోగులు తెలుసుకునే వారు. సొంత విషయాలు పంచుకుంటూ స్నేహమేరా జీవితం అన్నట్లు సాగింది వీరి ఫేస్ బుక్ పరిచయం. అయితే ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎక్కడికైనా టూర్ కి వెళ్దామని ఇద్దరు అనుకున్నారు. టూర్ పేరుతో స్నేహితుడిగా పరిచయమైన వ్యక్తి మరో వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు ఒకే వ్యక్తిని కిడ్నాప్(Kidnap) చేశారు. 


సుమారు మూడేళ్ల క్రితం జరిగిన కిడ్నాప్ కథే మళ్లీ రిపీటైంది. గుంటూరు జిల్లా(Guntur District)లోని తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన ఓ వ్యక్తికి హైదరాబాద్(Hyderabad)లో ఉంటున్న సూర్య అనే వ్యక్తితో  ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఇద్దరు బాపట్ల సూర్యలంక బీచ్‌(Suryalanka Beach)కు టూర్ కి వెల్దామని అనుకున్నారు. సూర్య ఇతర స్నేహితులతో కలిసి వస్తున్నానని బీచ్ కు రావాలని తన గుంటూరు స్నేహితుడితో నమ్మబలికాడు. సూర్య మాటలు నమ్మిన స్నేహితుడు సూర్యలంక వెళ్లేందుకు తెనాలి వచ్చాడు. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన సూర్య కారులో ఎక్కాడు. అయితే వాళ్లు అతడిని సూర్యలంక కాకుండా అదే కారులో హైదరాబాద్ తీసుకెళ్లి కిడ్నాప్ చేసి రూ.50 వేలు డిమాండ్ చేశాడు సూర్య. దీంతో బాధితుడు చేసేదేంలేక ఇంటికి ఫోన్ చేసి గూగుల్ పే(Google Pay) చేయించాడు. అయితే ఈ ఘటన జరిగి మూడేళ్లు అయింది. 


మళ్లీ ఇలాంటి మేసానికి పాల్పడ్డాడు సూర్య. ఈసారి కూడా బాధితుడు అతడే. ఫేస్ బుక్ లో సూర్య మహిళా ప్రొఫైల్‌(Profile)తో మరోసారి బాధితుడికి పరిచయం పెంచుకున్నాడు. కలవాలని ఉందని జనవరి18వ తేదీన సూర్యాపేటకు  రావాలని సూర్య బాధితుడికి మేసేజ్ పంపాడు. దీంతో బాధితుడు సూర్యాపేట వెళ్లాడు. అక్కడ సూర్యని చూడగానే షాక్ అయ్యాడు బాధితుడు. మరలా కిడ్నాప్‌కు చేసి ఈ సారి రూ.55 వేలు వసూలు చేశాడు. నిందితుల నుంచి తప్పించుకున్న బాధితుడు తెనాలి(Tenali) రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.