Asaram Bapu:
దోషిగా తేల్చిన గాంధీనగర్ కోర్టు
గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టు అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూని దోషిగా తేల్చింది. తన అనుచరుల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై అత్యాచారం చేశారని 2013లోనే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆశారాం. అప్పుడే గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా నిర్ధరించింది. ఈ కేసులో మొత్తం 7గురు నిందితులు కాగా...ఆశారాం బాపుని తప్ప మిగతా వారందరినీ ఇప్పటికే దోషులుగా తేల్చారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా...ఇన్నాళ్లు ఆశారాంను దోషిగా నిర్ధరించలేదు. ఈ ఆరుగురు దోషుల్లో ఆశారాం సతీమణి, కూతురు కూడా ఉన్నారు. సూరత్‌కు చెందిన ఓ మహిళను పదేపదే అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ తరవాత 2018లో జోధ్‌పూర్‌లోని ట్రయల్ కోర్ట్ దోషిగా తేల్చింది. అప్పటి నుంచి జోధ్‌పూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ఆశారాం బాపూ. జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2013లో ఆగస్టులో ఇండోర్‌లో ఆశారాంను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద దోషిగా తేల్చింది గాంధీనగర్ కోర్టు. రేపు శిక్ష ఖరారు చేయనున్నారు.