Sri Sathya Sai district మడకశిర: తెలుగు సంవత్సరాది Ugadi పండుగను సంబరంగా చేసుకోవాల్సిన రోజు భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు  ఓ బంగారు వ్యాపారి. సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో బంగారు వ్యాపారి కృష్ణమాచారి తన భార్య ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం సంచలనగా మారింది. తెల్లారితే పండుగ పిల్లలకు పండగ బట్టలు తీసుకురావడానికి బెంగళూరుకు వెళ్ళాడు బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన కృష్ణమాచారి కి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నీళ్లలో సైనేడ్ ద్రావకం కలిపి సేవించారు. దీంతో కృష్ణమాచారి తో పాటు భార్య ఇద్దరు పిల్లలు కూడా మరణించారు. 

కృష్ణమాచార్య కుమారుడు స్కూల్ టాపర్

కృష్ణమాచారికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు సంతోష్, చిన్న కుమారుడు భువనేష్. పెద్ద కుమారుడు మడకశిర పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నాడు. సంతోష్ ఎప్పుడు కూడా స్కూల్ టాపర్ గా ఉండేవాడు. ఇప్పటికే అన్ని పరీక్షలు రాసిన సంతోష్ మరొక్క పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ఉగాది పండుగకు ఇంటికి వచ్చాడు సంతోష్. ఇంతలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తల్లిదండ్రులతో పాటు సంతోష్ కూడా విఘాతజీవుడిగా  కనిపించాడు. స్కూల్లో ఎప్పుడు టాపర్ గా ఉండే సంతోష్ చనిపోయాడని తెలియడంతో స్కూలు యాజమాన్యంతో పాటు వారు మిత్రులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. 

అప్పులు, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణాల : 

అందరితో కలివిడిగా తిరిగే కృష్ణమాచారి కుటుంబంతో సహా ఆత్మతో చేసుకోవడంతో పండగ రోజు మడకశిర పట్టణంలో విశాల చాలు అలముకున్నాయి. అందరితో కలివిడిగా ఉండే కృష్ణమాచారి ఈ విధంగా చేసుకోవడం పట్ల అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియనప్పటికీ అప్పులు కుటుంబ కలహాలే కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.