Drunkards set up WhatsApp group for checking updates: తాగుబోతులు అని వాళ్లను అనకూడదు. వాళ్లు టాక్స్ పేయర్స్. ఆ టాక్స్ పేయర్స్ గౌరవం ఉండదు. తాగి రోడ్ల మీదకు వెళ్తే మళ్లీ ఫైన్స్. అందుకే ఈ తాగుబోతులు అందరూ ఎక్కడ... ఎలా కలుసుకున్నారో కానీ తాగిన తర్వతా పోలీసులకు దొరకూడదని డిసైడయ్యారు. అందుకే అందరూ కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. చెకింగ్ ల గురించి ఎవరికి సమాచారం తెలిసినా ఆ గ్రూపులో షేర్ చేసుకుంటున్నరాు. తనిఖీలు జరుగుతున్న వైపు తాగుబోతులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈ తాగుబోతుల ఐక్యత బయటపడింది. పోలీసుల కళ్లుగప్పి తిరగాలనుకున్న కొందరు యువకుల ప్లాన్ రివర్స్ అయింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల నుంచి తప్పించుకోవడానికి వీరు ఏకంగా పోలీస్ మామల స్క్వాడ్ పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. ఎక్కడెక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు? ఏ రూట్‌లో వెళ్తే క్షేమం? వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ పోలీసులకే సవాల్ విసిరారు. అయితే, ఒక చిన్న పొరపాటుతో ఈ స్మార్ట్ స్క్వాడ్ గుట్టు రట్టయింది.
గోదావరిఖనిలో పోలీసులు నిర్వహించిన రొటీన్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు, ఫోన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అందులో పోలీస్ మామల స్క్వాడ్ అనే గ్రూప్ కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆ గ్రూప్‌లో వందలాది మంది సభ్యులు ఉండటమే కాకుండా, పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు ఫొటోలు, లొకేషన్ల రూపంలో అప్‌డేట్ చేస్తున్నట్లు గుర్తించారు.
విషయం తెలుసుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్చా కచక్యంగా వ్యవహరించారు. ఆ యువకుడి ఫోన్ ద్వారానే తానే స్వయంగా ఆ గ్రూప్‌లోకి ప్రవేశించి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. నేను గోదావరిఖని టూ-టౌన్ ఎస్సైని.. మీ అందరి నంబర్లు నా దగ్గర సేవ్ అయ్యాయి. ఇకపై మీరు ఎక్కడ ఉన్నా ట్రాక్ చేస్తాం. మీ అందరికీ త్వరలోనే పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఉంటుంది అని మెసేజ్ చేయడంతో గ్రూప్ సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా ఇలాంటి గ్రూపులు నిర్వహించడం నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పట్టుబడిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాను ఇలాంటి అసాంఘిక పనులకు ఉపయోగిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
