Honda India: భారతీయ రహదారులపై ది పవర్ ఆఫ్ డ్రీమ్స్ అనే నినాదంతో దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న బ్రాండ్ హోండా. 1984లో హీరో సైకిల్స్‌తో కలిసి ఉమ్మడి భాగస్వామిగా ప్రయాణాన్ని ప్రారంభించి, 2011లో స్వతంత్రంగా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూట్ ఇండియాగా అవతరించిన ఈ సంస్థ నేడు దేశంలోనే అత్యంత నమ్మకమైన వాహన తయారీదారుగా గుర్తింపు పొందింది. నాణ్యమైన ఇంజన్లు, అద్భుతమైన మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చులో సామాన్యుడి నుంచి వేగంతో పోటీ పడే యువత వరకు అందరికీ నచ్చేలా తన పోర్ట్‌పోలియోను అప్‌డేట్ చేస్తోంది.
హోండా ప్రస్తుత మార్కెట్ పరిస్థితి పూర్తిగా భిన్నం
ప్రస్తుతం హోండా సంస్థ భార మార్కెట్‌లో మొత్తం 27 మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో 8 కమ్యూటర్ మోడళ్లు కాగా, 9 స్పోర్ట్స్ బైక్‌లు నాలుగు క్రూయిజ్లు, అడ్వెంచ్ ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను బట్టి 63, 191 రూపాయల నుంచి మొదలై 42, 82, 114 వరకు విభిన్న ధరల శ్రేణిలో ఈ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యమైన మోడళ్ల ధరల ఇలా ఉన్నాయి
హోండాషైన్ 100 - 63, 191 రూపాయలు
హోండా ఎస్పీ 125- 88, 528 రూపాయలు
హోండా యూనికార్న్- 1,13, 605 రూపాయలు నుంచి ప్రారంభమవుతుంది.
హోండా సీబీ350 హైనెస్- 1, 92, 435 నుంచి ప్రారంభమవుతుంది. హోండా గోల్డ్ వింగ్- 42, 82, 114 నుంచి ప్రారంభమవుతుంది.
కమ్యూటర్ విభాగంలో తిరుగులేని హోండా
సామాన్య ప్రజల రోజువారి ప్రయాణాలకు హోండాను ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని మైలేజీ, హోండా షైన్ 100 నగరం లోపల 62 కిలోమీటర్లు, హైవేపై 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 125సీసీ విభాగంలో షైన్ 125, ఎస్పీ 125 మోడళ్లు వాటి స్మూత్ గేర్ బాక్స్, రిఫైన్డ్ ఇంజన్ పనితీరులో టాపర్స్‌గా ఉన్నాయి.
ప్రీమియం, అడ్వెంచర్ విభాగంలో తగ్గేదేలేదంటున్న హోండా
హోండా కేవలం కమ్యూటర్ బైక్‌లకే పరిమితం కాలేదు. రెట్రో రోడ్‌స్టర్ విభాగంోల CB 350 రేంజ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజాలతో పోటీ పడుతుంది. CB 350, CB 350 RS, హైనెస్ మోడళ్లు హైవే క్రూయిజింగ్ అనువైనవి.
అడ్వెంచర్ ఇష్టపడే వారి కోసం NX500,, XL 750 ట్రాన్స్ ఆల్ఫ్ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ 750 ట్సాన్స్ ఆల్ఫ్ గరిష్టంగా 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంటోంది. ఇది అడ్వెంచర్ టూర్‌లకు అద్భుతంగా ఉంటుందని చెబుతోంది.
2026లో రాబోతున్న వాహనాలు
భవిష్య్‌లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని హోండా ఎలక్ట్రిక్ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోంది.
హోండా షైన్ ఎలక్ట్రిక్- ఇది 2026-28 మధ్య కాలంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర 1.30 లక్షలుగా ఉండవచ్చు.
CB 500F, CB 500R- 500 సీసీ విభాగంలో మరింత పట్టు సాధించడానికి ఈ స్పోర్ట్స్, నేకెడ్ బైక్‌లను హోండా తీసుకురానుంది. రెబెల్ 30- క్రూయిజర్ ప్రియుల కోసం 2.30 లక్షల ధరలో ఈ వాహనం వచ్చే ఛాన్స్ ఉంది.
హోండా ఎందుకు ప్రత్యేకం
హోండా బైక్‌ల పేర్లు పెట్టడం వెనుక చాలా మీనింగ్ ఉంటుంది. సీబీఆర్ అంటే క్రాస్ బీమ్ రేసర్, ఆర్ఆర్ అంటే రేస్ రెప్లికా అని అర్థం . ఇవి రేసింగ్ ట్రాక్‌లపై హోండా సాధించిన విజయాలను గుర్తు చేస్తాయి.
